నల్గొండ

గోదావరి జలాలు సాధించేవరకు ఉద్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొమ్మలరామారం, సెప్టెంబర్ 24: ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు గోదావరీ జలాలు సాదించేందుకు ఉద్యమం చేపడుతామని మాజి మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి యాదాద్రి భువనగిరి జిల్లాను సాదించామన్నారు. తపాసుపల్లి, బస్వాపూర్, షామీర్‌పేట్ రిజర్వాయర్ల ద్వారా ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సాగు, తాగునీరు సాధించడమే లక్ష్యంగా పోరాటం చేస్తామన్నారు. రిజర్వాయర్ల నిర్మాణంలో ముంపునకు గురయిన రైతులకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఆదరించి ఆశీర్వదించి మరొక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని మోత్కుపల్లి నర్సింహులు ప్రజలను కోరారు. ఈసమావేశంలో నాయకులు కొండోజు ఆంజనేయులు, గోలిపెల్లి పోశంరెడ్డి, సిలివేరు సుధాకర్‌రెడ్డి, పల్లెబాల్‌నర్సింహ్మగౌడ్, సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డి, తాళ్ల క్రిష్ణరెడ్డి, కురిమిళ్ల కిషోర్, నిడిగొండ బాల్‌రాజ్‌గౌడ్, ధీరావత్ లక్ష్మన్‌నాయక్, పల్లె క్రిష్ణగౌడ్, దులారి మల్లేశం, సుదర్శన్‌గుప్త, గుండు నాయక్ తదితరులు పాల్గొన్నారు.