నల్గొండ

సాగర్ ఎడమ కాల్వకు నీటి నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, సెప్టెంబర్ 24: సాగర్ ఎడమ కాల్వకు నీటిని సోమవారం ఉదయం డ్యాం అధికారులు నిలిపివేశారు. గత నెల 23 నుండి ఎడమకాల్వకు నీటివిడుదల చేస్తున్నారు. వారాబంది పద్దతిలో విడుదల చేస్తున్న కారణంగా వారం రోజుల పాటు నీటిని నిలిపివేసి, అనంతరం విడుదల చేయనున్నామని తెలిపారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో 583.20 అడుగుల నీటి మట్టం ఉండగా, శ్రీశైలం నుండి సాగర్‌కు 7,063 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుకుంటుంది. సాగర్ జలాశయం నుండి కుడి కాల్వ ద్వారా 10,867 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బిసి ద్వారా 2,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో సోమవారం సాయంత్రానికి 872.70 అడుగుల నీటి మట్టం ఉంది. ఈ నెల 23 నుండి సోమవారం వరకు 14.8 టిఎంసిల నీటిని ఎడమ కాల్వకు విడుదల చేశామని, వారబంది పద్దతిలో 45 టిఎంసిల నీటిని విడుదల చేస్తామని డ్యాం డిఈ విజయ్‌కుమార్ తెలిపారు.