నల్గొండ

కొలిక్కి వచ్చిన కోదాడ, హుజూర్‌నగర్ అభ్యర్థుల ఖరారు కసరత్తు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 24: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ, హుజూర్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థుల ఖరారు కసరత్తును ఆ పార్టీ అధిష్టానం తుది దశకు చేర్చింది. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కేటీఆర్ ఈ రెండు నియోజకవర్గాల్లో పీసీసీ చీఫ్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పద్మావతి దంపతులను ఢీ కొట్టేందుకు బలమైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వివిధ కోణాల్లో అవసరమైన కసరత్తు సాగించారని పార్టీ వర్గాల కథనం. కోదాడ నుండి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంత్‌రెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.చందర్‌రావులు టికెట్‌ను ఆశిస్తున్నారు. తనకు వీలుకాని పక్షంలో తన కుమార్తెకు టికెట్ కావాలంటు కేసీఆర్‌ను చందర్‌రావు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే కోదాడ టికెట్ రేసులో ఎమ్మెల్సీ, మండలి విప్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును కేసీఆర్, కేటీఆర్‌లు సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లుగా సోమవారం జిల్లా టీఆర్‌ఎస్ వర్గాల్లో బలంగా వినిపించింది. ఎన్నికల పిదప టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటులో పల్లాకు మంత్రి పదవి ఇచ్చే యోచనతో ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.
అటు హుజూర్‌నగర్ నుండి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ మరోసారి టికెట్ కోరుతుండటం టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి సమస్యగా తయారైంది. హుజూర్‌నగర్‌లో పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌ను ఓడించేందుకు అన్ని రకాలుగా బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సివుందని టికెట్ విషయంలో పట్టువీడాలని వచ్చే ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని శంకరమ్మకు మంత్రి కేటీఆర్ నచ్చచెప్పినట్లుగా సమాచారం. దీంతో హుజూర్‌నగర్ నుండి ఎన్నారై సైదిరెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో పది స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్, కేటీఆర్‌లు కోదాడ, హుజూర్‌నగర్‌లలో అసమ్మతికి ఆస్కారం లేకుండా ముందుగానే ఆశావహులతో చర్చించి అభ్యర్థులను ప్రకటించేందుకు తుది కసరత్తు పూర్తి చేశారని నేడోరేపో అభ్యర్థులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కిం కర్తవ్యం..!
రాజగోపాల్‌రెడ్డికి మరో షోకాజ్
పరిణామాలపై కేడర్‌లో టెన్షన్
కోమటిరెడ్డి బ్రదర్స్‌కు గాలం వేస్తున్న బీజెపీ, టీఆర్‌ఎస్

నల్లగొండ, సెప్టెంబర్ 24: కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి టీ.కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ మరో షోకాజ్ నోటీస్ జారీ చేయడం జిల్లా కాంగ్రెస్‌లో ప్రకంపనాలు రేపుతుంది. సోమవారం క్రమశిక్షణా కమిటీ చైర్మన్ కోదండరెడ్డి అధ్యక్షతన భేటీయైన క్రమశిక్షణా కమిటీ రాజగోపాల్‌రెడ్డి వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. షోకాజ్ నోటీస్‌లపై రాజగోపాల్‌రెడ్డి వివరణ ఇవ్వకపోగా ప్రెస్‌మీట్ పెట్టి పార్టీ అంతర్గత వ్యవహారాలను మరోసారి రచ్చకెక్కించారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తు వరుసగా రెండో షోకాజ్ నోటీస్‌ను జారీ చేసింది. 24గంటల్లో తమకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. రాజగోపాల్‌రెడ్డి వ్యవహారించిన తీరుపై క్రమశిక్షణా సంఘం సభ్యులు సుదీర్ఘంగా చర్చించి ఎన్నికల సమయంలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహారించిన తీరు సరిగా లేదన్న అభిప్రాయంతో మరో షోకాజ్ నోటీస్ జారీ చేశారని పార్టీ వర్గాల సమాచారం. కాగా రాజగోపాల్‌రెడ్డికి రెండో షోకాజ్ జారీ కావడం పట్ల ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ క్యాడర్‌లో, కోమటిరెడ్డి వర్గీయుల్లో తీవ్ర టెన్షన్ మొదలైంది. రాజగోపాల్‌రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తారా లేక రెండో షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇస్తే ఇంతటితో వివాదానికి తెర దించుతారా అన్న అంశాలపై కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకర్గం స్థానం టికెట్ విషయంలో రాజగోపాల్‌రెడ్డి గట్టి పట్టు పడుతుండటం కూడా ఆయనకు పార్టీలో ప్రతికూలంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది.
అటు తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి వివాదం విషయమై అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటిదాకా బహిరంగంగా స్పందించనప్పటికి ఈ వివాదాన్ని ఎన్నికల వేళ పెద్దదిగా మార్చవద్దని పార్టీ పెద్దలకు సర్దిచెప్పే ప్రయత్నాల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైన అసలే ముక్కుసూటిగా వ్యవహారించే రాజగోపాల్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీని వీడటం ఎంతమాత్రం ఇష్టం లేనప్పటికి పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యవహారిస్తున్నారని గట్టి నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలో రాజగోపాల్‌రెడ్డి ఏ క్షణానా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోని ఆయన వర్గీయులతో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్నికల వేళ రాజగోపాల్‌రెడ్డి వంటి యువనేతను దూరం చేసుకోవడం సరికాదన్న భావన వారిలో వినిపిస్తోంది. మరోవైపు షోకాజ్ నోటీస్‌లపై ఆగ్రహంతో ఉన్న రాజగోపాల్‌రెడ్డిని తమ వైపు ఆకర్షించేందుకు అటు బీజెపీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర నేతలు టచ్‌లో ఉన్నట్లుగా సాగుతున్న ప్రచారం సైతం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తికరంగా మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరిని తమవైపు లాగేందుకు ఆ పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం మరోసారి చక్కర్లు కొడుతుండటం ఉమ్మడి జిల్లా రాజకీయాను వేడెక్కించింది.

నాడు ఘోరీలు... నేడు సంక్షేమ పథకాలు
* ఆశీర్వాద సభలో ఎంపీల ఆరోపణ

తుంగుర్తి, సెప్టెంబర్ 24: ఒకనాడు హత్యా రాజకీయాలతో అలమటించిన తుంగతుర్తి నియోజకవర్గం నేడు సంక్షేమ పథకాలతో కలకలలాడుతుందని టీఆర్‌ఎస్ ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, బూర నర్సయ్యగౌడ్‌లు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో సోమవారం నిర్వహించిన టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్ధి గాదరి కిషోర్‌కుమార్ ఆశీర్వాదయాత్ర సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. దశాబ్దాల కాలంగా తుంగతుర్తిలో వివిధ రాజకీయ పార్టీల నేతల ఆధిపత్య పోరుకు అనేక మంది బలయ్యారని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ చూసినా హత్యా రాజకీయాలతో బలైనవారి ఘోరీలు, శిలలు, స్మారకస్థూపాలే ఏర్పాటయ్యాయన్నారు. ఆనాటి పాలకులకు అభివృద్ధిని విస్మరించారని తెలిపారు. నేటికి కూడా హత్యా రాజకీయాలతో గ్రామాలను వదిలివెళ్లిన సంఘటనలు ఉండటం దురదృష్టకరమనానరు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని తెలిపారు. మళ్లీ కిషోర్‌కుమార్‌ను గెలిపిస్తే తుంగతుర్తి మరింత అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని తెలిపారు. మాజీ ఎమెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో రూ.1600 కోట్లతో అభివృద్ధి పథకాలు చేపట్టామన్నారు. తుంగతుర్తి ప్రజలకు మరోసారి సేవ చేయడానికే పార్టీ అధినేత కేసీఆర్ రెండోమారు తనను పంపించాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కన్వీనర్ రజాక్, మండల పార్టీ అధ్యక్షుడు జి.సైదులు, నాయకులు జి.రాములు, యుగేందర్‌రావు, సీతయ్య, భిక్షం, విక్రమ్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పట్టనంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.