నల్గొండ

ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, సెప్టెంబర్ 25:ఖతాదారులకు మెరుగైన సేవలందించడమే ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లక్ష్యమని బ్యాంకు ఏజీఎం రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని హనుమాన్‌పేట ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో రుణాల మంజూరు కోసం అసెట్ మేనేజ్‌మెంట్ హబ్ పేరిట ప్రత్యేక రుణ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణాల మంజూరు కోసం ఖాతాదారులు ఇబ్బందిపడకుండా త్వరగా రుణాల మంజూరు చేసేందుకు అసెట్ మేనేజ్‌మెంట్ హబ్ పేరిట ప్రత్యేక ఋణా విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకులో ఇతర పనుల ఒత్తిడి వలన రుణాలు అందించడం ఇబ్బందిపరంగా మారిన నేపథ్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు రుణాల మంజూరులో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నా మన్నారు. మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని మిర్యాలగూడ పట్టణంతో పాటు దామరచర్ల, ఆగామోత్కుర్, నేరేడుచర్ల, నిడమనూర్, త్రిపురారం, వేములపల్లి, మాడ్గులపల్లి, అంజనపల్లి ఏపీజీవీబీ శాఖలు బ్యాంకుల రుణ వ్యవహారాలను ఒకే గొడుగు కింద పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో అడ్వాన్స్ మేనేజర్ ప్రశాంత్‌రెడ్డి, హబ్ మేనేజర్ శ్రీన్స్, అసిస్టెంట్ మేనేజర్ జనార్ధన్‌రావు, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, బ్యాంకు సిబ్బంది నారాయణ, కొండయ్య, రాజేష్ పాల్గొన్నారు.

టీఆర్‌ఎస్ హయాంలో కులవృత్తులకు ప్రాధాన్యత
* ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్
భూదాన్‌పోచంపల్లి, సెప్టెంబర్ 25: టీఆర్‌ఎస్ హయాంలోని కులవృత్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీవివాస్ అన్నారు. మంగళవారం మండలంలోని జలాల్‌పూర్ గ్రామంలో స్వామి రామనంద గ్రామీణాసంస్థలో కుమ్మరి శాలివాహనులకు మంజూరైన పనిముట్ల కొనుగోలుపై జరిగిన రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కులవృతుల్లో నైపుణ్యాన్ని పెంచుకోని వ్యాపార రంగంలో రాణించాలని సూచించారు. చేతివృత్తుల అభివృద్ధి నిర్వహించే శిక్షణా కార్యాక్రమాలను సద్వివినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్, రామనంద సంస్థ డైరక్టర్ ఎన్ కిషోర్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ అధికారం రాంరెడ్డి, కుమ్మరి శాలివాహన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలి
* గడగడపకు కాంగ్రెస్‌లో డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్
ఆత్మకూరు (ఎం) సెప్టెంబర్ 25: టీఆర్‌ఎస్ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని తుక్కపురంలో గడగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి ప్రచారంలో ఆయన మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్రూం, మూడెకెరాల భూమి ఇవ్వకపోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. కార్యాక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేంద్రగుప్తా, సిద్ధులు, యాట లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ మల్లేష్, ఎంపీటీసీ నరసింహాచారి, నాయకులు లోడి శ్రీను, హనుమంతు, వౌలనా, మహేష్, నగేష్ పాల్గొన్నారు.