నల్గొండ

గొల్లకుర్మలకు అండగా టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండాల, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కుర్మలను అన్నా విధాల ఆదుకున్న ఎకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వమని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో నిర్వహించిన గొల్ల కుర్మల ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడుతూ అడవిలో బతుకుతున్న గొల్లకుర్మలు ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో రాష్ట్ర ఆపధర్మ మఖ్యమంత్రి కేసీఆర్ 5వేల కోట్లతో 95లక్షల గొర్లను పంపిణీ చేసి ఆదుకున్నారని తనలాంటి వారిని పెద్దల సభకు పంపించిన గనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. గొల్ల కుర్మలో మాటతప్పరు మడమతిప్పరని రాబోయో ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అనంతరం అలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గొంగిడి సునిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గొల్లకుర్మలు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలన్నా ధృడసంకల్పంతో కేసీఆర్ వారికి పెద్ద పీట వేసిందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావల్సిన అవసరం ఎంతైన ఉందని ప్రజలు ఆశీర్వదించి మరల తనను గెలిపించాలని కోరినారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహులు రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి గొంగిడి మహెందర్‌రెడ్డి, ఎంపీపీ వేణుగోపాల్, జెడ్పీటీసీ రామక్రిష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు బండ రమేష్ రెడ్డి, రైతు సమన్వయ కమిటి మండల కన్వినర్ పాండరీ,మూగల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు
తిరుమలగిరి, అక్టోబర్ 14: మండలకేంద్రంలో బతుకమ్మ పోటీలను ఆదివారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుండి డప్పు చప్పుళ్లతో మహిళల కోలాట నృత్యాలతో సంత ఆవరణకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆయన సతీమణి కమలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల మాట్లాడుతూ మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే బతుకమ్మ రంగురంగుల పూలతో పేర్చుకొని వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం బాగా అలంకరించిన బతుకమ్మలకు నగదుతో పాటు వ్యక్తిగత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ జాన్‌జిన్ని, మండల అధ్యక్షులు డాక్టర్ కోటాచలం, సంతోష్, మల్లేశ్‌నేత, ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్, వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, ఎస్.రఘనంధన్‌రెడ్డి, మూల అశోక్‌రెడ్డి, బత్తుల శ్రీను, నరోత్తమరెడ్డి, కల్లెట్లపల్లి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.