నల్గొండ

కేంద్ర పథకాలే విజయానికి దోహదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటరూరల్, అక్టోబర్ 14: అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలే వచ్చే ఎన్నికల్లో గెలుపునకు దోహదం చేస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం మండలంలోని పిన్నాయిపాలెం గ్రామ పంచాయతీ ఆవాసం జెతూనాయక్‌తండాలో మాజీ ఉప సర్పంచ్ రమావత్ నెహ్రూ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ పార్టీ నుండి వందమంది కార్యకర్తలు సంకినేని సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాశయ కండువాలు కప్పి స్వాగతించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం అమలుచేస్తున్న పథకాలనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తు వాటిని తమ గొప్పగా చెప్పుకుంటుందని విమర్శించారు. కొన్ని పథకాలను తాము అమలుచేస్తున్నామని చెబుతూ మరికొన్ని కేంద్ర పథకాలను పట్టించు కోవడం లేదన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పొయిందని, అందువల్లే ఓటమి భయంతో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్దమయ్యారన్నారు. నియోజకవర్గంలో మంత్రి చేసిన అభివృద్ధి ఏమి లేదని, అధికారంతో మంత్రి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే తనను గెలిపిస్తే అభివృద్ధి చేయడంతో పాటు అన్ని వర్గాలకు అండగా ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు నల్లకుంట్ల అయోధ్య, ఓబీసీమోర్చా జిల్లా అధ్యక్షుడు తాడోజు సలేంద్రచారి, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి దేవరకొండ జనార్ధన్, మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పు శ్రీను, ప్రధాన కార్యదర్శి శ్యామల శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు అనంతుల వాసుదేవారెడ్డి, వెన్నా శశిధర్‌రెడ్డి, సత్యనారాయణ, మల్సూరు తదితరులు పాల్గొన్నారు.

లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలు
తిరుమలగిరి, అక్టోబర్ 14: మండలకేంద్రంలో బతుకమ్మ పోటీలను ఆదివారం లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తెలంగాణ చౌరస్తా నుండి డప్పు చప్పుళ్లతో మహిళల కోలాట నృత్యాలతో సంత ఆవరణకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తుంగతుర్తి తాజా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆయన సతీమణి కమలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల మాట్లాడుతూ మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకునే బతుకమ్మ రంగురంగుల పూలతో పేర్చుకొని వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం బాగా అలంకరించిన బతుకమ్మలకు నగదుతో పాటు వ్యక్తిగత బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ జాన్‌జిన్ని, మండల అధ్యక్షులు డాక్టర్ కోటాచలం, సంతోష్, మల్లేశ్‌నేత, ఎంపీపీ కొమ్మినేని సతీష్‌కుమార్, వైస్ ఎంపీపీ సుంకరి జనార్ధన్, ఎస్.రఘనంధన్‌రెడ్డి, మూల అశోక్‌రెడ్డి, బత్తుల శ్రీను, నరోత్తమరెడ్డి, కల్లెట్లపల్లి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.