నల్గొండ

కోడ్‌ను పకడ్బందీగా అమలుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, అక్టోబర్ 16: శాసనసభా సాధారణ ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలుచేయాలని జిల్లా కలెక్టర్ కే.సురేంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్‌లో రెవెన్యూ, పోలీస్, ఎక్సెజ్‌శాఖల అధికారులతో ఎన్నికల నియమావళి అమలుపై జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్‌కోడ్ పర్యవేక్షణ కోసం నియమించిన వివిధ స్థాయి అధికారుల బృందాలు విస్తృతంగా పర్యటించి పర్యవేక్షించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద నిరంతరం నిఘా ఉంచాలని, ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. రెవెన్యూ, పోలీస్‌శాఖల సిబ్బంది సమన్వయంతో ఎన్నికల నిర్వహణ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల సమయంలో అభ్యర్ధులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన, ఘర్షణలకు దిగిన అల్లర్లకు పాల్పడ్డ సీ-విసిల్ యాప్ ద్వారా ఎలా ఫిర్యాదు నమోదు చేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సువిధా యాప్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించిన ఆన్‌లైన్‌లో సింగిల్ విండో విధానం ద్వారా ప్రచార వాహనాలు, మైకు, సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతులు పొందేందుకు రూపొందించినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఈ యాప్‌ను పర్యవేక్షిస్తూ పరిశీలన చేసి అనుమతులు ఇవ్వాలన్నారు. ఎన్నికల నేపధ్యంలో జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలతో కూడిన వివరాలను తక్షణమే తనకు అందజేయాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ రావిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన ఫ్లయింగ్ స్క్వాడ్, ఎంసీసీ బృందాల పర్యవేక్షణలో తనిఖీలు చేపట్టి నగదుతో పాటు మారణాయుధాలు, ఇతర ఎలాంటి వస్తువులు లభ్యమైన సమీప పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలుచేసేందుకు పోలీస్‌శాఖ తరుపున అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేసీ సంజీవరెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి ఉదయ్‌కుమార్, డీఆర్‌డీఎ పీడీ కిరణ్‌కుమార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, డీసీవో ఎస్వీ ప్రసాద్, సూర్యాపేట, కోదాడ ఆర్డీవోలు మోహన్‌రావు, కిశోర్‌కుమార్, డీఎస్పీలు నాగేశ్వర్‌రావు, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లగించిన వారిపై కేసు
ఆలేరు, అక్టోబర్ 16: ఎన్నికల నిబంధనలను ఉల్లగించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఆలేరు ఎస్సై జే.వెంకట్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలలోకి వెళ్తే జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చేరిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్ అతనితో పాటు మరో 9మంది అనుమతిలేకుండా హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ ముట్టడికి బస్సులో ఆలేరు వరకు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా హైదరాబాద్ ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినందుకు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసామని ఎస్సై తెలిపారు.

మూడు రోజులు మార్కెట్ యార్డ్‌కు సెలవులు
మోత్కూర్, అక్టోబర్ 16: మోత్కూర్ మార్కెట్ యార్డ్‌కు దసరా పండుగను పురస్కరించుకొని బుధ, గురు, శుక్ర సెలవులు ప్రకటించినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి డి.శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. రైతులు 3 రోజుల పాటు ధాన్యం తీసుకరావద్దని కోరారు.

శ్రీరాంసాగర్ నీటిని విడుదల చేయాలి
* కాంగ్రెస్‌పార్టీ రాస్తారోకో
మద్దిరాల, అక్టోబర్ 16: శ్రీరాంసాగర్ రెండవదశ నీటిని వదలి రైతాంగాన్ని ఆదుకోవాలని మండల కేంద్రంలోని సూర్యాపేట-దంతాలపల్లి రహదారిపై మంగళవారం కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా తుంగుతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌పార్టీ ఇంచార్జి గుడిపాటి నర్సయ్య మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గానికి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి నీటిని అధిక మొత్తంలో విడుదలచేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరాంసాగర్ జలాలలు 2008 లోనే తుంగతుర్తి నియోజకవర్గంలో అన్ని చెరువులు, కుంటలు నింపిన ఘనత కాంగ్రెస్‌పార్టీదేనన్నారు. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నియోజకవర్గానికి గోదావరి నీటిని తెచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తలాపున గోదావరి జలాలు పోతున్న నియోజకవర్గంలో ఏ ఒక్క చెర్వు నింపకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి సూర్యాపేట నియోజకవర్గానికి నీటిని తరలిస్తున్నా చూసి మాట్లాడలేని అసమర్థ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అని విమర్శించారు. ఓట్లకోసం అరకొర నీటిని వదిలి చేతులు దులుపుకున్నారన్నారు. ఈ రాస్తారోకోలో మండల పార్టీ అధ్యక్షులు షేక్ ముజీబ్, కిసాన్ సెల్ అధ్యక్షులు వాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వర్కింగ్ అధ్యక్షులు చామకూరి వెంకన్న, నాయకులు రేసు విజయ్, తరుణ్‌కుమార్, పాలబిందెల శ్రీనివాస్, తిరుమలేష్, యాదిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.