నల్గొండ

అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 16: మునుగోడు గడ్డపై మళ్లీ గులాబీ జెండాను ఎగరవేసేందుకు కార్యకర్తలకు కార్యోణ్ముకులు కావాలని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. చౌటుప్పల్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లాలన్నారు. ప్రతిపక్షాలు సాగిస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు ఉనికిని కాపాడుకునేందుకు తప్పుడు ప్రచారాలకు పూనుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తుందన్నారు. మరోమారు అవకాశం ఇస్తే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. గ్రామాలలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం లేకుండాపోయిందన్నారు. ఉనికి కోసం లేనిపోని ఘర్షణలకు పాల్పడుతున్నారని విమర్శించారు. అభివృద్ధి ఎవరి హయాంలో జరుగుతుందో ప్రజలకు తెలుసన్నారు. 60 యేళ్లు వెనగబడిన తెలంగాణను నాలుగేళ్లలోనే అభివృద్ధి బాటలో నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అన్ని స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కూటమిలు ఏర్పడినా డిపాజిట్ దక్కించుకునేందుకు ప్రయత్నించాల్సిందేనన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పడుతున్న మహాకూటమి కుట్రల కూటమిగా అభివర్ణించారు. ప్రతి కార్యకర్త అంకితభావంతో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి. జడ్పీటీసీ పెద్దిటి బుచ్చిరెడ్డి, జెల్లా మార్కండేయులు, బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, ఊడుగు మల్లేశంగౌడ్, ఊడుగు శ్రీనివాస్‌గౌడ్, ఎం.డి.బాబాషరీఫ్, కొత్త పర్వతాలు, ఎడ్ల మహేందర్‌రెడ్డి, కంది లక్ష్మారెడ్డి, చెన్నగోని అంజయ్యగౌడ్, ముప్పిడి శ్రీనివాస్, వీరమళ్ల సత్తయ్య, బొమ్మిరెడ్డి వెంకట్‌రెడ్డి, గుండెబోయిన వెంకటేశం, సుర్వి మల్లేశం, ఎం.దయాకరాచారి, నల్ల అంజయ్య, చీరిక మల్లారెడ్డి, జి.అయోధ్య, గణేష్, ఆనంద్, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గొంగిడి సునీతకు ఓట్లు అడిగే హక్కులేదు
గొంగిడి బినామీగా అనుచరుల అక్రమ భూదందాలు
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తా..
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్
యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 16: ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్ట మండలంలో దళితుల భూములే కాకుండా ఇతరుల భూములు, దేవస్థానం సత్రాలకు సంబంధించిన ప్లాటును మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఆమె భర్త బినామీలుగా తన అనుచరులతో అక్రమ భూదందాలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. ఈ విషయమై దళితులు, ఇతరులు తహశీల్దార్, కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇవ్వగా, స్పందించిన కలెక్టర్ ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారని తెలిపారు. దానిలో భాగంగానే సునీత, ఆమె భర్తపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని, కాని, ఇంత వరకు వారిని పోలీసులు అరెస్ట్ చేయలేదని వివరించారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత బాధితులతో కలిసి వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. దళితుల భూములు తిరిగి దళితులకు ఇవ్వకపోతే మాజీ ఎమ్మెల్యే సునీతను గ్రామాల్లో అడ్డుకుంటామని హెచ్చరించారు. గొంగిడి దంపతుల భూ అక్రమ దందాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డికి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. నియోజకవర్గంలో సునీతకు ఓట్లు అడిగే హక్కు లేదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బాధితులు కాలె స్వామి, కాలె వెంకటేష్, ముడుగుల రాములు, బాలమ్మ, టీఎమ్మార్పీఎస్ నాయకులు బూడిద సురేందర్, పులెపాక భిక్షపతి, గుర్రం మహేందర్, గ్యార నరేష్, బొట్ల శ్రీను, బైరగాని నాగరాజు, సంగి స్వామి పాల్గొన్నారు.