నల్గొండ

జాఫర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 21: గురువారం అర్ధరాత్రి జాఫర్ అనే యువకుడి హత్యను చాలెంజ్‌గా స్వీకరించిన పోలీసులు సంఘటణ స్థలంలో దొరికిన ఆధారాల ప్రకారం జాఫర్ పిన్ని జమీలీ ఇచ్చిన పిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు కేసు మిస్టరీనీ ఇరువైనాలుగంటల లోపే చేదించారని ఈ హత్య కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని పలు కేసులలో సంబందం ఉన్న ఇద్దరిపై పీడీ ఆక్ట్‌ను నమోదు చేయడం జరిగిందని డీసీపీ రాంచంద్రారెడ్డి తెలిపారు.ఆదివారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోడీసీపీ రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ హత్యకు గురైన జాఫర్ గతంలో పలు కేసులలో నిందితుడని అతడిపై రౌడీషీటర్ కేసుందని హత్య చేసిన సతీష్ నేరచెరితుడని అతని అన్న సంతోష్ నేరచరితుడని తెలిపారు. గతంలో జాఫర్‌కు సతీష్‌కు తగాదాలు ఏర్పడ్డాయని ఇద్దరు ఒక సందర్బంలో ఘర్షణ పడడం జరిగిందని ఈ విషయంలో కేసు నమోదు చేయడం జరిగిందని కక్షతోనే హత్య చేయడం జరిగిందని ఈ హత్య కేసులో నలుగురు పాల్గొన్నారని, హత్య అనంతరం కారులో నాగోల్ బ్రిడ్జీ కింద శవాన్ని వేసి ఇంకో వ్యక్తి సహకారం తీసుకున్నారని అన్ని కోణాల్లో విచారణ సాగించి. ఈ హత్య ఉదంతాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారించి పలు గ్రామాలకు చెందిన ఐదు గురు నిందితులు సతీష్, సంతోష్, సురేష్, హరీష్, శ్రీకాంత్‌లను అదుపులోకి తీసుకున్నామని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించడం జరిగిందని తెలిపారు.ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి నిఘూ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.ఎన్నికలు సజావుగా జరిగేందుకు గట్టి నిఘూ ఏర్పాటు చేశామని రౌడీ షీటర్స్,ఎన్నికల్లో కేసులు ఉన్న వారిని ఎప్పటి కప్పుడు నిఘూ ఉంచామని ఎవ్వరైనా హద్దు మీరితే ఉక్కుపాదం మోపుతామని అన్నారు.ఇరువై నాలుగు గంటల్లో హత్య కేసును చేదించిన ఏసీపీ మహేందర్‌రెడ్డి,రూరల్ సీఐ ఆంజనేయులు, టౌన్ సీఐ నర్సిండరావు, ఎసై మధుబాబు, రమేష్, వెంకటయ్య, ఏఎసై ముఖేష్‌బాబు, శ్రీనివాస్‌రెడ్డిలను అభినందించారు.

మహాకూటమి మెనిఫెస్టోను
కాపీ కొట్టిన కేసీఆర్: టీడీపీ
యాదగిరిగుట్ట రూరల్,అక్టోబర్ 21: మహాకూటమి మ్యానిఫేస్టోను మక్కికి మక్కి కాఫీ కొట్టి టీ ఆర్‌ఎస్ మెనీఫెస్టోగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటమిని అంగీకరించినట్లేనని మహాకూటమి విజయం డిసెంబర్ 11న సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడం ఖాయమని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు జిల్లా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి అన్నారు. ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ పేదలు,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ అని స్వర్గీయ నందమూరి తారకరామారావు భూస్వామ్యలు,పటేల్ పట్వారీ వ్యవస్థను తీసివేసి ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను అందించారని పేదలు కూడా రాజకీయాల్లోకి వచ్చింది ఎన్‌టీ రామారావుపరిపాలలోనేనని అందుకే తెలంగాణలో గట్టి పట్టున్న టీడీపీ లేదని చెప్పడం టీ ఆర్ ఎస్ బలహీనతకు నిదర్శనమని అన్నారు. టీ ఆర్ ఎస్ ఓటమే ధ్యేయంగా టీడీపీ మహాకూటమిలో భాగంగా ఉందని అన్నారు. రెండు రోజుల్లో టీడీపీ మ్యానిఫేస్టోను విడుదల చేయనున్నామని రాష్ట్రం లో అన్ని పట్టణాల్లో అన్న క్యాంటీన్లను ప్రారంబించనున్నామని ప్రతి ఒక్కరికి 5 రూపాయలకే భోజనం అందిస్తామని,రైతులకు రెండు లక్షణ రు ణ మాఫీ ఏక కాలంలో అందిస్తామని, క్యాలండర్ ఉద్యోగాలు ప్రకటిస్తామని, నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు.

బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి
* బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య
సూర్యాపేటరూరల్, అక్టోబర్ 21: పాలక పార్టీలు జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు రాయితీలు ఇవ్వకుండా రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలని బీసీ సంక్షేమసంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్ధానిక జనగాం క్రాస్‌రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు అగ్రకులాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాయని, జనానాలో 50శాతం ఉన్న బీసీలకు ఏ ఒక్కపార్టీ కూడ చిత్తశుద్దితో పనిచేయాలేదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలను డబ్బు, మద్యం ఇతర ప్రలోభాలకు గురిచేయకుండా ఎన్నికల సంఘం పనిచేయాలన్నారు. బీసీలకు పాలకపార్టీలు రాయితీలతో మభ్య పెట్టకుండా రాజకీయాల్లో ప్రాతినిధ్యమివ్వాలని ఆయన డిమాండ్ చేశారు.