నల్గొండ

శాంతి భద్రతలతోనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: శాంతి భద్రతల పరిరక్షణ సక్రమంగా ఉంటేనే ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం అభివృద్ధి పనులు సమర్ధవంతంగా కొనసాగించేందుకు అవకాశముంటుందని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్‌లు అన్నారు. ఆదివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా స్మృతి పరేడ్‌లో పాల్గొని అమరవీరుల స్థూపం వద్ధ నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. శాంతియుత సమాజ నిర్మాణంలో పోలీస్ పాత్ర కీలకమని, త్యాగాలు, సవాళ్లతో కూడిన విధి నిర్వాహణలో పోలీసులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ప్రజారక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులు చిరస్మరణీయమని వారి స్ఫూర్తితో అంతా ముందుకు సాగాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో పోలీస్ శాఖ మరింత సమర్ధవంతంగా తన విధులు నిర్వహిస్తుందన్నారు. పోలీస్ అమరుల త్యాగాల బాటలో తీవ్రవాదం, ఉగ్రవాదం లేని సమాజం నిర్మాణంలో పోలీస్ సిబ్బంది పునరంకితం కావాలన్నారు. విధి నిర్వాహణలో సామాన్య ప్రజలకు న్యాయం అందించినప్పుడే అమరవీరులకు నిజమైన నివాళి అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించే పోలీస్ శాఖ సమర్ధవంతమై సేవలందించాలన్నారు. అనంతరం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన ప్రతిభా పోటీల విజేతలైన విద్యార్థులకు జ్ఞాపికలు, సర్ట్ఫికెట్లు అందించారు. అమరవీరుల కుటుంబాలకు కానుకలు అందించారు. వారితో కలిసి పోలీస్ కార్యాలయం నుండి గడియారం సెంటర్ వరకు స్మృతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాకారుల బృందం అమరుల త్యాగాలను స్మరిస్తు ఆటపాటల ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఏస్పీ పద్మనాభరెడ్డి, డిఎస్పీ గంగారామ్, రమేష్, సురేష్, శాంతి సంఘం సభ్యులు కొండకింది చిన వెంకట్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, గోలి అమరేందర్‌రెడ్డి, పోలీస్ అధికారు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంచందర్‌గౌడ్, సోమయ్య, జయరాజ్, సీఐలు సురేష్, భాషా, శివరాంరెడ్డి,రమణారెడ్డి, అనిల్, అంజయ్య, ఏఆర్ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

కుల దురహంకార హత్యలు తగదు: విమలక్క
మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 21: కులదురహంకార, ప్రేమవివాహాలు చేసుకున్న వారిని తిరిగి హతమార్చే కార్యక్రమం చేపడితే తగు రీతిలో గుణపాఠం చెప్పెందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణా యునైటెడ్ ఫ్రంట్ (టఫ్) రాష్ట్ర అధ్యక్షులు విమలక్క అన్నారు. ఆదివారం రాత్రి మిర్యాలగూడ పట్టణంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ప్రణయ్ సంస్మరణ సభలో ఆమె మాట్లాడుతూ ప్రేమించి కులాంతర పెళ్లిళ్లు చేసుకున్న వారిని హతమారిస్తే వారికి తాను హెచ్చరిక చేస్తున్నానన్నారు. వారికి దళిత ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారన్నారు. మనువాదం దేశంలో పెరిగిపోతున్నదని ప్రొఫెసర్ కాశీం అన్నారు. మను వాదులు తమవాదాన్ని మారుతిరావుకు మద్దతు తెలుపుతున్నారని, ఎదిరించాలన్నారు.

కమలం తొలి జాబితాలో గంగిడి, సంకినేని
* ఎదురుచూపుల్లో పది సీట్ల ఆశావహలు
నల్లగొండ, అక్టోబర్ 21: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా వెల్లడిలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సంబంధించి పనె్నండు అసెంబ్లీ స్థానాలకుగాను మునుగోడు, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ ఎన్నికల సమర శంఖం పూరించింది. మునుగోడు నుండి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, సూర్యాపేట నుండి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వర్‌రావుల అభ్యర్ధిత్వాలను బీజేపీ ప్రకటించింది. వీరు ఇద్దరు కూడా అవే స్థానాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పార్టీ విస్తరణకు కృషి చేశారు. సంకినేని ఏకంగా మంత్రి జి.జగదీష్‌రెడ్డికి నువ్వానేనా అన్నట్లుగా పోటీనివ్వగా ఈ దఫా సైతం అదే స్థాయిలో సూర్యాపేటలో సంకేనేని అటు మహాకూటమి అభ్యర్ధితో, టీఆర్‌ఎస్ అభ్యర్ధి జగదీష్‌రెడ్డితో ఢీ కొట్టనున్నారు.