నల్గొండ

ప్రచారంలో కోమటిరెడ్డి, కంచర్ల పోటాపోటీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 21: నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య ఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతుంది. ఓటర్లను ఆకట్టుకోవడంతో ఇద్దరు కూడా ఒకరికొకరు తీసిపోకుండా ప్రచారం సాగిస్తుండటంతో వారి వెంట ఆ పార్టీల కేడర్ నిత్యం ప్రచార క్షేత్రంలో పరుగులు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. కోమటిరెడ్డి ప్రచారం చేసిన చోట ఆ మరుసటీ రోజునే కంచర్ల ప్రచారం చేస్తుండగా, కంచర్ల ప్రచారం చేసిన తదుపరి కోమటిరెడ్డి తన ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఆదివారం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ మున్సిపాల్టీలోని అబ్బాసియ కాలనీ, ఓసిటిఎల్ కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వరుసగా ఇరవై ఏళ్లుగా స్థానిక ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కోమటిరెడ్డి ఓటర్లను నేరుగా పలకరిస్తువారిని కుశల ప్రశ్నలు వేస్తు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి, కుటుంబ పాలనతో పోరాడి సాధించుకున్న తెలంగాణను భ్రష్టుపట్టించిందని, ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించి రాష్ట్రాన్ని కాపాడాలని ఓటర్లను కోరారు. అనంతరం నర్సింగ్‌భట్ల, ధమ్మన్నగూడెం, చెన్నుగూడెం, దోనెపల్లి గ్రామాల్లో, తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది టీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరారు.
మార్నింగ్ వాక్‌లో కంచర్ల ప్రచారం
టీఆర్‌ఎస్ నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన ఎన్నికల ప్రచారాన్ని జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాల మైదానంలో కొనసాగించారు. ఉదయం మార్నింగ్ వాక్‌కు వచ్చిన స్థానిక ప్రజలతో, కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో, ఇతర క్రీడాకారులతో కలిసి కంచర్ల భూపాల్‌రెడ్డి ఉదయం నడకలో పాల్గొని, వివిధ ఆటల్లో వారితో పాటు భాగస్వామ్యమై తన ఎన్నికల ప్రచారం సాగించారు. వరుసగా నల్లగొండ నుండి నాలుగుసార్లు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గెలిపించారని, ఈ దఫా మార్పు కోరుతు నియోజకవర్గం అభివృద్దికి, ప్రజలకు సేవ చేసేందుకు తనకు ఒక అవకాశమివ్వాలని కంచర్ల వారిని అభ్యర్ధించారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు దేశంలోనే ఆదర్శనీయంగా నిలిచాయని ఆ పథకాలు కొనసాగించాలంటే తనను గెలిపించి కేసీఆర్ ప్రభుత్వం తిరిగి ఏర్పడేలా సహకరించాలని కంచర్ల ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో కంచర్ల వెంట ఎంపిపి రెగట్టే మల్లిఖార్జున్‌రెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యుశ్రీనివాస్, వేదశ్రీ శ్రీనివాస్, అబ్బగోని కవితారమేష్, వాకర్స్ అసొసియేషన్ నాయకులు ఎన్. భీమార్జున్‌రెడ్డి, డాక్టర్ పుల్లారావు తదితరులు ఉన్నారు.

పది స్థానాల్లో ఆశావహుల ఎదురుచూపులు

బీజేపీ తొలి జాబితాలో అభ్యర్థుల పేర్లు ఖరారుకాని నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్,

హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు అసెంబ్లీ స్థానాల టికెట్ల కోసం ఆ పార్టీ ఆశావహులు తమ ప్రయత్నాల్లో జోరు పెంచారు. తదుపరి జాబితాల్లో టికెట్లు సాధించి ప్రచార పర్వంలోకి దిగాలన్న ఆతృతతో వారు అధిష్టానం వద్ధ టికెట్ల ఖరారుకై ఒత్తిడి పెంచుతున్నారు. నల్లగొండ అసెంబ్లీ స్థానంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డితో పాటు రామోజీ షణ్ముఖ, బండారు ప్రసాద్‌లు, కోదాడ నియోజకవర్గంలో బొలిశెట్టి కృష్ణయ్య, వందనపు సురేష్, యాద రమేశ్, హుజూర్‌నగర్‌లో బొబ్బ భాగ్యారెడ్డి, జిల్లెపల్లి వెంకటేశ్వర్లు, నాగార్జున సాగర్ నుండి చెన్ను వెంకటనారాయణరెడ్డి, కంకణాల శ్రీ్ధర్‌రెడ్డి, మిర్యాలగూడ సెంటర్ నుండి కర్నాటి ప్రభాకర్, రమణారావు, రేపాల పురుషోత్తంరెడ్డి, కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరుతారని భావిస్తున్న గిరిజన నేత ఒకరు బిజెపి టికెట్ రేసులో ఉన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో నేనావత్ లక్ష్మణ్‌నాయక్, కల్యాణ్ నాయక్‌లు టికెట్ రేసులో ఉన్నారు.
భువనగిరిలో పార్టీ అధ్యక్షుడు పి.వి.శ్యాంసుందర్‌రావుకు టికెట్ ఖాయమంటుండగా, కాంగ్రెస్ నుండి గట్టిగా టికెట్ కోరుతున్న యువ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి పేరును సైతం ఈ స్థానంలో బీజేపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఆలేరు నుండి కాసం వెంకటేశ్వర్లు, దొంతిరి శ్రీ్ధర్‌రెడ్డిలు టికెట్ ఆశిస్తున్నారు. నకిరేకల్‌లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత పోతేపాక సాంబయ్య, నకిరేకంటి మొగిలయ్య, బాకి పాపయ్యలు, తుంగతుర్తిలో ఓయు జేఎసి నేత గద్దల అంజిబాబు, రిటైర్డ్ మైనింగ్ అధికారి కడియం రామచంద్రయ్యలు రేసులో ఉన్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో బీజేపీ తదుపరి జాబితాలో పూర్తి స్థాయిలో అన్ని సీట్లకు అభ్యర్థులను వెల్లడించనున్నారు.