నల్గొండ

తొలి రోజు తొమ్మిది నామినేషన్లు దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల నిర్వాహణలో భాగంగా నామినేషన్ల ఘట్టం తొలి రోజు సోమవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆలేరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునిత నామినేషన్ దాఖలు చేయగా, కాంగ్రెస్ నుండి బూడిద భిక్షమయ్యగౌడ్, ఆయన సతీమణి బూడిద సువర్ణల తరుపునా వారి అనుఛరులు నామినేషన్లు దాఖలు చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్ధి గంగిడి మనోహర్‌రెడ్డి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపునా లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ దాఖలు చేయగా, కోదాడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పంది పెద్ద తిరుపతయ్య నామినేషన్ దాఖలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా ధనావత్ లాలునాయక్, సుంకు శ్రీనివాసులు నామినేషన్లు దాఖలు చేశారు. నల్లగొండ నియోజవర్గంలో చొల్లేటి ప్రభాకర్ స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. హుజూర్‌నగర్, తుంగతుర్తి, నాగార్జున సాగర్, భువనగిరి, నకిరేకల్, దేవరకొండ నియోజకవర్గాల్లో తొలి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.
ఆలేరులో మూడు నామినేషన్లు దాఖలు
* బీ-్ఫంతో నామినేషన్ వేసిన గొంగిడి సునిత
ఆలేరు, నవంబర్ 12: ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ముందస్తు ఎన్నికల్లో భాగంగా తొలి రోజు సోమవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని ఆలేరు ఎంపీపి అనసూర్య, గుండాల జెడ్పీటీసి రామకృష్ణా రెడ్డి, ఆలేరు యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడైన మోహన్‌రావ్, వెంకయ్యలతో కలిసి నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారైన ఉపేందర్ రెడ్డికి అందజేశారు. తన నామినేషన్‌తో పాటు పార్టీ ఇచ్చిన బీ-్ఫంను కూడా రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు బూడిద భిక్షమయ్యగౌడ్ తన నామినేషన్‌ను ఏజెంట్ అయిన లగ్గాని నర్సింహ ద్వారా రిటర్నింగ్ అధికారికి అందజేశారు. భిక్షమయ్యగౌడ్ సతీమణి సువర్ణ కూడ తన ఏజెంట్ అయిన తవిటి నర్సిరెడ్డి ద్వారా ఆర్‌ఓకు అందజేశారు. వీరిరువురు కాంగ్రెస్ పార్టీ పేరున నామినేషన్లు దాఖలు చేశారు. తొలి రోజు నామినేషన్లు వేసిన ముగ్గురు అభ్యర్థులు కూడా తమ ఎన్నికల అఫిడవిట్లను అందజేయలేదు.