నల్గొండ

బీ-్ఫంలతో టీఆర్‌ఎస్‌లో జోష్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 12: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాలకుగాను పది స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీ-్ఫమ్‌లు అందించడంతో నామినేషన్ల దాఖలుకు భారీ సన్నాహాలు చేసుకుంటునే ఇంకోవైపు ప్రచార జోరు పెంచారు. బీ-్ఫమ్‌లు సైతం చేతికందడంతో ఇక గెలుపు సాధనకు కావాల్సిన కసరత్తులు సాగించడంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు నిమగ్నమయ్యారు. తుంగతుర్తి నుండి గాదరి కిషోర్, సూర్యాపేట నుండి మంత్రి జి.జగదీష్‌రెడ్డి, సాగర్ నుండి నోముల నరసింహయ్య, మునుగోడు నుండి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, దేవరకొండ నుండి ఆర్.రవీంద్రకుమార్, నకిరేకల్ నుండి వేముల వీరేశం, మిర్యాలగూడ నుండి ఎన్.్భస్కర్‌రావు, ఆలేరు నుండి గొంగిడి సునీత, భువనగిరి నుండి పైళ్ల శేఖర్‌రెడ్డి, నల్లగొండ కంచర్ల భూపాల్‌రెడ్డిలు బీ-్ఫమ్‌లు అందుకుని తమ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు.
ఎడతెగని నిరీక్షణ..
మహాకూటమి పార్టీల ఆశావహులు టికెట్ల ఖరారులో జాప్యంతో కలవర పడుతున్నారు. సోమవారం రాత్రి వరకు కూడా సీట్లు, టికెట్ల ఖరారుపై ఢిల్లీ నుండి ప్రకటన వెలువడకపోవడంతో ఎప్పుడెప్పుడు దీనిపై స్పష్టత వస్తుందోనన్న ఉత్కంఠతో ఎదురుచూపులు పడుతున్నారు. కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్తచరణ్‌దాస్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌లు, తదుపరి అధిష్టానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన కె.జానారెడ్డి, రేవంత్‌రెడ్డిలు సోమవారం రాహుల్, సోనియాగాంధీలతో కూటమి పార్టీల మధ్య సీట్లు, టికెట్ల కేటాయింపుపై తర్జన భర్జనలు సాగించారు. ఐనప్పటికి సీట్ల, టికెట్ల కేటాయింపులపై స్పష్టత రాకపోవడం కూటమి పార్టీ ఆశావహుల సహనానికి పరీక్షగా మారింది. ఇంకోవైపు సీపీఐ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ నియోజవర్గం నుండి తన అభ్యర్ధిగా నెల్లికంటి సత్యంను ప్రకటించడంతో ఈసీటును ఆశిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సమస్యగా మారింది. మిర్యాలగూడ స్థానాన్ని జానారెడ్డి కుమారుడు రఘువీరారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇవ్వని పక్షంలో ఈ సీటును టీజెఎస్‌కు కేటాయించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సిద్ధపడింది. అయితే ఢిల్లీ వెళ్లిన జానారెడ్డి మిర్యాలగూడ స్థానంపై రాహుల్‌తో చర్చించినట్లుగా తెలుస్తుండగా ఈ సీటుపై నిర్ణయం గందరగోళంగా ఉంది.