నల్గొండ

ఉత్తమ్ సతీమణి నామినేషన్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, నవంబర్ 14: మహాకూటమిలో భాగంగా కోదాడ నియోజకవర్గ టికెట్ ఉత్తమ్ పద్మావతి రెడ్డికి దక్కడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సహాలు వెల్లువెత్తాయి. గ్రామ గ్రామాల్లో బూత్‌స్థాయి ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి అత్యధిక మెజార్టీతో గెలిచేందుకు కార్యక్రమాన్ని రూపొందించారు. బుధవారం పద్మావతి రెడ్డి కోదాడ మహాకూటమి అభ్యర్థిగా వేణుగోపాలపురం గుడిలో, బరాఖత్‌గూడెం వేంకటేశ్వరస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. మరోసెట్‌ను మహాకూటమి కార్యకర్తలు, నాయకులతో ర్యాలీగా వెళ్ళి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
వారసత్వ రాజకీయాలను తిప్పికొట్టాలి
గుత్తా సుఖేందర్ రెడ్డి
మిర్యాలగూడ, నవంబర్ 14: కాంగ్రేస్ పార్టీ చేస్తున్న వారసత్వ రాజకీయాలను తిప్పికొట్టాలని రైతుసమన్వయసమితి రాష్ట్ర అధ్యక్షుల, నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డిలు అన్నారు. బుధవారం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ దేశంలోని 29రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అమలుచేయని విధంగా రైతులసంక్షేమం, రైతుబీమా పధకాలను ముఖ్యమంత్రి కెసిఆర్ అమలుచేశారని ఆయన అన్నారు. రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం పధకాలను అమలుచేయడం జరిగిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనను ఇతర రాష్ట్రాలు ప్రసంసిస్తున్నాయని పేర్కొన్నారు. డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్ధిని ఓడించి టిఆర్‌ఎస్ అభ్యర్ధిని గెలిపించి కేసీఆర్‌ని తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికోసం అహర్నిషలు కృషి చేస్తున్నానన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకుగాను దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్యం గల యాదాద్రి ధర్మల్‌పవర్ కేంద్రం పనులు శరవేగంతో జరుగుతున్నాయన్నారు. మిర్యాలగూడ పట్టణ అభివృద్ధికోసం మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ 200కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రతి వార్డులో కోటిరూపాయలతో సిసిరోడ్లు, డ్రైనేజీ పనులను చేపట్టడం జరుగుతుందన్నారు. దామరచర్ల మండలంలో 25వేల ఎకరాల బీడుభూములకు సాగునీరు అందించేందుకగాను 3ఎత్తిపోతల పధకలను మంజూరు చేయించడం జరిగిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ సమాగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేసే తనను మరోసారి గెలిపించాలని ఆయన కోరారు. సమావేశంలో మాజి ఎమ్మెల్యే తిప్పన విజయసింహరెడ్డి, ఎఎంసి చైర్మన్ చిట్టిబాబునాయక్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు తిరునగరు భార్గవ, మున్సిపల్ వైస్ చైర్మన్ మగ్ధుం పాష, నాయకులు దుర్గంపూడి నారాయణరెడ్డి, మోసీన్‌అలీ, బాబునాయక్, కరుణాకర్‌రెడ్డి, వీరకోటిరెడ్డి, పాపిరెడ్డి, సూర్యనాయక్, మర్రిరెడ్డి, నామిరెడ్డి యాదగిరిరెడ్డి, మట్టపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.