నల్గొండ

ఉమ్మడి జిల్లాలో మూడో రోజు 42మంది నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 14: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియలో భాగంగా మూడో రోజు బుధవారం పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 42మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నల్లగొండ నియోజకవర్గంలో మూడో రోజున నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి, బిఎల్‌ఎఫ్ అభ్యర్ధి అక్కెనపల్లి మీనయ్య, బిఎస్పీ అభ్యర్ధి బోళ్ల వెంకట్‌ముదిరాజ్, స్వంతంత్ర అభ్యర్ధిగా మరోసారి చొల్లేటి ప్రభాకర్‌లు నామినేషన్లు వేశారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డ్డి, కాంగ్రెస్ అభ్యర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా పాల్వాయి శ్రవణ్‌కుమార్‌రెడ్డి, బీరు వెంకటేశ్‌లు నామినేషన్లు వేశారు. నాగార్జున సాగర్‌లో బిజెపి అభ్యర్ధిగా కంకణాల నివేధితారెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్దిగా నోముల నరసింహయ్య, కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.జానారెడ్డి తరుపునా జడ్పీ వైస్ చైర్మన్ కె.లింగారెడ్డిలు నామినేషన్లు వేశారు. కోదాడ నియోజకవర్గంలో టీడీపీ రెబల్‌గా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొల్లం మల్లయ్యయాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధిగా పద్మావతి ఉత్తమ్, టీఆర్‌ఎస్ రెబల్ జలగం సుధీర్‌లు నామినేషన్స్ వేశారు. హుజూర్‌నగర్ నుండి టీఆర్‌ఎస్‌కు చెందిన సాముల శివారెడ్డి, బాణోతు పద్మాభాయి, బిజెపి నుండి బొబ్బా భాగ్యారెడ్డిలు నామినేషన్స్ దాఖలు చేశారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పైళ్ల శేఖర్‌రెడ్డి తరుపునా ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి నామినేషన్స్ సమర్పించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుండి టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా గాదరి కిషోర్, కాంగ్రెస్‌కు చెందిన గుడిపాటి నర్సయ్య, వడ్డెపల్లి రవి, దోసపాటి గోపాల్‌లు నామినేషన్ దాఖలు చేశారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్దిగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బిఎల్‌ఎఫ్ అభ్యర్దిగా రాపర్తి శ్రీనివాస్‌గౌడ్, స్వతంత్ర అభ్యర్ధిగా ముప్పని లింగారెడ్డి, దేవత సైదులులు నామినేషన్స్ వేశారు. ఆలేరు నుండి కాంగ్రెస్ అభ్యర్ధి బూడిద భిక్షమయ్యగౌడ్, బిఎల్‌ఎఫ్ అభ్యర్ధి మోత్కుపల్లి నరసింహులు, బిజెపి అభ్యర్ధి దొంతిరి శ్రీ్ధర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్ధిగా జనె్న వెనె్నల, టీఆర్‌ఎస్ అభ్యర్ధి గొంగిడి సునీత తరుపునా ఆమె అనుఛరులు మరోసెట్ నామినేషన్స్ సమర్పించారు. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం తరుపున ఆయన సతీమణి వేముల పుప్ప, కాంగ్రెస్ నుండి చిరుమర్తి లింగయ్య, స్వతంత్ర అభ్యర్ధి చినె్నని జానయ్యలు నామినేషన్స్ వేశారు. దేవరకొండ నియోజకవర్గంలో టీడీపీకి చెందిన నేనావత్ భిక్ష్యానాయక్, మిర్యాలగూడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి నలమోతు భాస్కర్‌రావు, సీపీఎం నుండి జూలకంటి రంగారెడ్డి, డబ్బీకార్ మల్లోజీ, స్వతంత్ర అభ్యర్థులుగా పల్లపు భిక్షపతి, ధనావత్ ఉషానాయక్‌లు నామినేషన్స్ దాఖలు చేశారు.