నల్గొండ

కేసీఆర్ మాటలు ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనగల్, నవంబర్ 14: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కనగల్ మండలంలోని బుడుమార్లపల్లి, బచ్చన్నగూడం, జీ ఎడవెల్లి, కురంపల్లి, రాంచంద్రాపురం, తుర్కపల్లి, తదితర గ్రామాలలో గడపగడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ప్రజలు కోమటిరెడ్డికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ అరాచక పాలన సాగిస్తున్నారని అన్నారు. బతుకమ్మ పండుగకు కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల సమభావన సంఘానికి పది లక్షల వడ్డీ లేని రుణం ఏక కాలంలో రెండు లక్షల రుణ మాఫీ, లక్ష ఉద్యోగాలు, ఉచిత గ్యాస్ పథకాలను చేపడతానన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భిక్షం యాదవ్, ఎంపీటీసీలు నర్సింగ్ సునిత కృష్ణయ్య గౌడ్, రాజీవ్, నాయకులు అనూప్ రెడ్డి, రామకృష్ణ, నర్సింహ, యాదగిరి రెడ్డి, పెంటయ్య తదితరులు ఉన్నారు.

నెహ్రూ సేవలు మరవలేనివి
* కోమటిరెడ్డి వెంకటిరెడ్డి
నల్లగొండ రూరల్, నవంబర్ 14: భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 129వ జయంతి సందర్భంగా బుధవారం గడియారం సెంటర్‌లోఆయన విగ్రహానికి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి నెహ్రూ సేవలు మరువలేనివని బ్రిటీష్ వాళ్లనుండి స్వాతంత్య్రం తీసుకువచ్చేందుకు చివరివరకు పోరాటం చేశాడన్నారు. దేశానికి మొదటి ప్రధానిగా ఉండి దేశాభివృద్ధికి కృషి చేశాడన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని, పంచవర్ష ప్రణళికలను అమలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.