నల్గొండ

సమగ్ర ప్రణాళికతో అభివృథ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 14: సమైక్య పాలనలో అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న సూర్యాపేట నియోజకవర్గాన్ని నాలుగున్నర ఏళ్ల పాలనలో అభివృద్ధి పథం ఎలా ఉందో చూపించానని, ప్రజలు మరోమారు అవకాశమిచ్చి ఆశీర్వదిస్తే ఆదర్శ నియోజవర్గంగా తీర్చిదిద్దే సమగ్ర ప్రణాళికను సిద్దం చేసుకున్నట్లు రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖల మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని 33వవార్డు శ్రీనగర్ కాలనీలో కాలనీవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ అభినందనసభకు హజరయ్యారు. ఈ సందర్భంగా వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు హనమంతరావుతో పాటు మరో 300మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2014కు ముందు సూర్యాపేటలో పెట్రేగిపోయిన రౌడీయిజాన్ని అంతమొందించి అన్ని వర్గాల వారు శాంతియుత జీవనం సాగించేలా చేసిన ఘనత తమదేనన్నారు. దశాబ్ధలుగా మూసీ మురికినీటినే సేవిస్తున్న ప్రజలకు విముక్తి కలిగించి కృష్ణాజలాలు అందించామన్నారు. నాలుగున్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్దిని కొలమానంగా చూసి ప్రజలు మరోసారి తనకు అవకాశమిస్తే ప్రజాప్రతినిధిగా కాకుండా ప్రజల జీతగానిలా పనిచేస్తానన్నారు. సూర్యాపేటలో మెడికల్ కళాశాల ఏర్పాటు, మోడల్ మార్కెట్ నిర్మాణాలతో ఈ పట్టణ రూపురేకలే మారిపోతున్నాయన్నారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని 60్ఫట్ల రోడ్డును 100్ఫట్ల రోడ్డుగా అభివృద్ది చేయడంతో పాటు 200ఎకరాల్లో ఆటోనగర్, పారిశ్రామికవాడలను నిర్మించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తానన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు మరోమారు గెలిపించేందుకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయసంస్ధ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ నేరళ్ల మధు, డాక్టర్ రాంమూర్తియాదవ్, బీరవోలు శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.