నల్గొండ

చివరి నిమిషంలోనైనా నాకే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 15: ప్రజాదరణ కలిగి అన్ని సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నందున సూర్యాపేట కాంగ్రెస్ టికెట్ చివరి నిమిషంలోనైనా మార్పు జరిగి తనకే దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నానని, ఈ మేరకు అధిష్ఠానం నుండి సంకేతాలు కూడా అందాయని పీసీసీ కార్యదర్శి పటేల్ రమేష్‌రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఆశించి భంగపడిన ఆయన భవిష్యత్ కార్యచరణపై చర్చించేందుకు గురువారం జిల్లాకేంద్రంలో అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ప్రజలు, కాంగ్రెస్ కేడర్ తానైతేనే విజయం సాధిస్తానని భావించారని, ఈవిషయం ఢిల్లీ వరకు చేరినప్పటికీ కొందరు కుట్రలు చేసి టికెట్ రాకుండా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం వాస్తవ పరిస్థితిని తెలుసుకొని తనకు అవకాశం ఇస్తుందనే నమ్మకంతో శుక్రవారం 30 వేల మందితో భారీ ప్రదర్శనగా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. నామినేషన్ కార్యక్రమం ద్వారా సత్తా చాటి ఢిల్లీ పెద్దలు దిగివచ్చేలా కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. తనకు టికెట్ వస్తే ఓటమి ఖాయమని భావించిన మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావులు అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేట నియోజకవర్గం వలస పాలకులతో అభివృద్ధికి దూరంగా ఉందన్నారు. మంత్రి అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడుతూ నియోజకవర్గంలో ఆరచాక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం అధ్యక్షతన జరిగిన సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్మినేటి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ ముదిరెడ్డి రమణారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎడ్ల వీరమల్లు, సత్యనారాయణరెడ్డి, కౌన్సిలర్లు వెలుగు సంతోషి, దేవేందర్, గోగుల రమేష్, షఫిఉల్లా పాల్గొన్నారు.

అభ్యర్థిత్వం ఖరారులో జాప్యం
* సెల్‌టవర్ ఎక్కి అద్దంకి, డాక్టర్ రవి వర్గీయుల హల్‌చల్
తిరుమలగిరి, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీలో తమ నాయకునికే తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని అద్దంకి దయాకర్ అభిమాని ఒకరు సూర్యాపేట రోడ్డులో సెల్‌టవర్ ఎక్కాడు. వెంటనే దామోదర్‌రెడ్డి వర్గీయులు వడ్డెపల్లి రవికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీకి చెందిన ఇద్దరు బీసీ కాలనీ వద్ద ఉన్న సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశారు. సూర్యాపేట రోడ్డులో టవర్ ఎక్కిన యువకుడు, అద్దంకి దయాకర్ అభిమాని అయిన నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడుని గంటసేపు శ్రమించి అతనికి నచ్చచెప్పి పోలీసులు కూడా టవర్ పైకి ఎక్కి కిందకు అతడిని కిందకు దించారు. బీసీ కాలనీ సమీపంలో టవర్ ఎక్కిన కాంగ్రెస్ పార్టీ యువకులు ఎలుగుల కొమరమల్లు, డేపి విజయ్‌లు వడ్డపల్లి రవికి టికెట్ కేటాయించేవరకు సెల్ టవర్ దిగేదిలేదని భీష్మించుకున్నారు. దామోదర్‌రెడ్డి వర్గీయులు, పార్టీ నాయకులు, ఎస్సై దానియల్‌కుమార్ వారికి నచ్చచెప్పి కిందకు దించారు. ఆ ముగ్గురు యువకులను ఎస్‌ఐ అదుపులోకి తీసుకున్నారు. తుంగతుర్తి టికెట్ ఇవ్వకుండా జాప్యం చేయడంతో రెండు వర్గాలకు చెందిన నాయకుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి వారుగా టికెట్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం వెంటనే టికెట్ ఎవరికో ఒకరికి కేటాయిస్తే నాయకుల్లో ఉత్కంఠ తగ్గుతుందని చర్చనీయాంశంగా మారింది.