నల్గొండ

నెగ్గిన జానా పంతం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 15: మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం వద్ద తన పంతం నెగ్గించుకున్నారని సమాచారం. తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి మిర్యాలగూడ నియోజవర్గం కాంగ్రెస్ టికెట్‌ను సాధించడంలో సఫలీకృతులైనట్లుగా తెలుస్తోంది. గురువారం ఢిల్లీలో ఉన్న జానారెడ్డి తన కుమారుడికి టికెట్ సాధించడంలో రాహుల్‌గాంధీని, స్క్రీనింగ్ కమిటీని ఒప్పించారని జానా వర్గీయుల్లో ఆనందోత్సహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న కాంగ్రెస్ కట్టుబాటును అధిగమించి మరీ కుమారుడికి టికెట్ సాధించడంలో జానా ఒత్తిడి ఫలించిందని ఈ ఎన్నికల్లో నాగార్జున సాగర్ నుండి తండ్రి జానారెడ్డి, మిర్యాలగూడ నుండి ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డిల పోటీ ఖాయమైందని కాంగ్రెస్ వర్గాల సమాచారం. అయితే మిర్యాలగూడ సీటును తెలంగాణ జన సమితి కోరుకోగా కాంగ్రెస్ తుది జాబితా వెలువడే వరకు రఘువీర్‌రెడ్డికి టికెట్ కేటాయింపు సందిగ్ధంగానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో మిర్యాలగూడ నుండి జానా అనుచరుడు మాజీ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావును గెలిపించగా, ఆయన పార్టీ మారి ఈ దఫా టీఆర్‌ఎస్ నుండి పోటీ చేస్తున్నారు. అనుచరుడిపై జానారెడ్డి తన కుమారుడిని పోటీకి దించుతుండటం రాజకీయంగా ఆసక్తిరేపుతుంది.
ఇది ఇలా ఉండగా దేవరకొండ(ఎస్టీ) నియోజకవర్గం టికెట్ కోసం జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్, ఇన్‌చార్జి జగన్‌లాల్ నాయక్, రేవంత్‌రెడ్డి అనుచరుడు కేతావత్ బిల్యానాయక్‌లు పోటీ పడుతుండటంతో వారిని రాహుల్ ఢిల్లీకి పిలిపించారు. వారితో చర్చల పిదప ముగ్గురిలో ఒకరికి టికెట్ ఇవ్వడం లేదా సీటును సీపీఐకి కేటాయించడంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తుంగతుర్తి(ఎస్సీ) నియోజకవర్గంలో సైతం అద్దంకి దయాకర్, డాక్టర్ వి.రవిలు కాంగ్రెస్ టికెట్ రేసులో ఉండగా వారితో సైతం కాంగ్రెస్ అధిష్ఠానం చర్చించి నేటీ ఉదయంకల్లా తుది జాబితాను వెల్లడించనున్నారు. దేవరకొండ, తుంగతుర్తి, మిర్యాలగూడల కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకంటించిన పక్షంలో ఆ పార్టీకి సంబంధించి జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఖరారు పూర్తికానుంది.
టీఆర్‌ఎస్‌లో తేలని కోదాడ అభ్యర్థిత్వం !
టీఆర్‌ఎస్ పార్టీ నుండి జిల్లాలో పనె్నండు అసెంబ్లీ స్థానాల్లో పెండింగ్‌లో ఉన్న హుజూర్‌నగర్ స్థానానికి ఎన్నారై శానంపూడి సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ కోదాడ స్థానంపై మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. కోదాడ టీఆర్‌ఎస్ టికెట్ కోసం ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనెపల్లి చందర్‌రావులు రేసులో ఉన్నారు. వీరిలో చందర్‌రావు పేరును నేడు ప్రకటిస్తాంచనున్నట్లుగా టీఆర్‌ఎస్ వర్గాల కథనం. మరోవైపు హుజూర్‌నగర్ టికెట్‌ను ఆశించి భంగపడిన కాసోజు శంకరమ్మ తనకు టికెట్ రాకుండా మంత్రి జగదీశ్‌రెడ్డి అడ్డుపడ్డారన్న కోపంతో సూర్యాపేట, హుజూర్‌నగర్‌లలో నామినేషన్ వేస్తారన్న ప్రచారం టీఆర్‌ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ టికెట్‌ను శానంపూడి సైదిరెడ్డికి కేసీఆర్ కేటాయించినప్పటి నుండి అజ్ఞాతంలోకి వెళ్లిన శంకరమ్మ తన భవిష్యత్ కార్యాచరణపై ఏ విధంగా స్పందిస్తుందోనంటు రాజకీయ వర్గాల్లో ఆసక్తి మారింది.