నల్గొండ

కోదాడలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, నవంబర్ 16: కోదాడ తెలుగుదేశంపార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లం మల్లయ్య యాదవ్‌ను శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి పార్టీలోకి బోకే ఇచ్చి ఆహ్వానించారు. సాయంత్రం హైదరాబాద్‌లో కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈసందర్భంగా శశిధర్‌రెడ్డి మాట్లాడుతూ బొల్లం మల్లయ్య యాదవ్ తమ పార్టీలోకి రావడం ఆనందంగా ఉందని, అందరూ సమష్టిగా కలిసి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకునేందుకు కృషిచేస్తామని తెలిపారు. తక్కువ సమయం ఉన్నందున గ్రామ గ్రామాలలో టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కోదాడ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి పొత్తులు పెట్టుకొని గెలుపొందేందుకు ఎత్తులువేస్తుందని, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి 40 నుండి 50వేల మెజార్టీతో కోదాడ నియోజకవర్గాన్ని గెలిపించుకుంటామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నామని, చివరి భూములకు కూడా నీరు అందించామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పథకాలను సమిష్టిగా కలిసి ముందుకు తీసుకెళ్ళేందుకు మళ్ళీ టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టాలని కోరారు. కేటీఆర్ కోదాడ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా మున్సిపల్ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించారని తెలిపారు.
బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్, టీడీపీలు మహాకూటమి పేరుతో ఉత్తమ్ కుమార్‌రెడ్డి నియంతృత్వంలో తెలుగుదేశం పార్టీలో బాధితులుగా ఉన్న తాము ఒక కూటమిగా ఏర్పడాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ అంటే ఉత్తమ్, ఉత్తమ్ అంటే కాంగ్రెస్ అనే అహంకార ధోరణితో ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలుచేయాలంటే మళ్ళీ అధికారంలోకి రావాలని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థికి తనపూర్తి సహకారాన్ని అందించి కోదాడ సీటును కేసీఆర్‌కు బహుమతిగా అందిస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గసభ్యులు యెర్నేని వెంకటరత్నం బాబు, చిలుకూరు ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు, రాయపూడి వెంకటనారాయణ, తుపాకుల భాస్కర్, చిలక రమేష్ పాల్గొన్నారు.