నల్గొండ

కేసీఆర్ ప్రచార సభలకు సన్నాహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 16: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో తన దూకుడు కొనసాగిస్తున్నారు. అసెంబ్లీ రద్దు.. ఆ వెంటనే అభ్యర్థుల ప్రకటన చేసి పలు జిల్లాల్లో తొలి దఫా ప్రచార సభలు నిర్వహించి ప్రతిపక్షాల కంటే ముందే ఎన్నికల భేరీ మ్రోగించిన కేసీఆర్ మరోవిడత నియోజకవర్గాల వారిగా ఎన్నికల ప్రచార సభలకు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో ఈనెల 21న నకిరకేల్, దేవరకొండ, భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్థులు వేముల వీరేశం, ఆర్.రవీంద్రకుమార్, పైళ్ల శేఖర్‌రెడ్డిల ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ హాజరవుతున్నారు. 23వ తేదిన సూర్యాపేట, తుంగతుర్తి అభ్యర్థులు మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిషోర్ ఎన్నికల ప్రచార సభలకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే ముందస్తుగా టికెట్లు ఖరారవ్వడంతో రెండు నెలలకుపైగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ విపక్షాల కంటే ప్రచార పర్వంలో ముందున్నారు. ఇక కేసీఆర్ ప్రచార సభలతో వారి ప్రచారం మరింత జోరందుకోనుండటం మహాకూటమితో పాటు ఇతర పార్టీలకు సవాల్‌గా మారింది.
* త్వరలోనే కాంగ్రెస్ ప్రచారానికి భట్టి రాక
అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో ఒకవైపు కారు పార్టీ టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు, ప్రచార పర్వంలో జోరు మీదుండగా మహా కూటమి పార్టీలు నామినేషన్ల ప్రక్రియ దశలో కూడా సీట్లు, టికెట్ల పంచాయతీలను తేల్చుకోకపోవడం ఆ పార్టీ శ్రేణులను కలవర పెడుతోంది. కొంతలో కొంత ఊరటగా రెండుమూడు రోజుల్లో ఆలేరు, భువనగిరి, మునుగోడులో భట్టి విక్రమార్క ప్రచారానికి రానుండటం ఆ పార్టీ ఎన్నికల ప్రచార జోరును పెంచనుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన భువనగిరి, నల్లగొండ, నాగార్జున సాగర్, కోదాడ, హుజూర్‌నగర్, ఆలేరు, సూర్యాపేట, నకిరేకల్, మునుగోడు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కె.జానారెడ్డి, పద్మావతిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, ఆర్.దామోదర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు నామినేషన్లు వేశారు. వాటిల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ నుండి పటేల్ రమేష్‌రెడ్డి, మునుగోడులో సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, నకిరేకల్‌లో ప్రసన్నరాజ్‌లు రెబెల్స్‌గా నామినేషన్లు వేశారు. ఇక అభ్యర్థులను ప్రకటించాల్సిన దేవరకొండ, మిర్యాలగూడ, తుంగతుర్తిలలో ఏ పార్టీ పోటీ చేస్తుందో అభ్యర్థులు ఎవరో తెలియని గందరగోళం కొనసాగుతుంది. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని పనె్నండు స్థానాల్లో తమకు ఒక్క స్థానమైన కేటాయించలేదన్న కోపంతో ఉన్న టీడీపీ నాయకత్వం, సీపీఐ, టీజేఎస్‌లు మహాకూటమి మిత్రధర్మానికి తూట్లు పొడిచే రీతిలో పలుచోట్ల తిరుగుబాటులు చేస్తుండటం మరింత సమస్యగా మారింది. ఈ నేపధ్యంలో కారు పార్టీ స్పీడును హస్తం ఏ విధంగా అధిగమించి ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తుందన్న సందిగ్ధం కూటమి శ్రేణులను ఆందోళన పరుస్తోంది.

సంక్షేమ పథకాలతోనే తెలంగాణ అభివృద్ధి
* రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా
కనగల్, నవంబర్ 16: సంక్షేమ పథకాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, అటవీ శాఖ అభివృద్ధి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా శక్రవారం పొనుగోడు, గుర్రంపల్లి, రాంచంద్రాపురం, లింగాలగూడెం, జీ ఎడవెళ్లి, బచ్చన్నగూడెం, మాత్రేనిగూడెం, బుడమర్లపల్లి తదితర గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి చెందుతుందన్నారు. నల్లగొండ నియోజకవర్గంలోనే గత 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉండి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ప్రజలకు మాయమాటలతో ఎన్నికలలో ప్రచారంగా తిరిగి ఓట్లు వేయించుకుని మళ్లీ నాలుగున్నర సంవత్సరాల వరకు ప్రజలకు కనబడకుండా పోయే వ్యక్తికి కాకుండా ఈసారి టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు. ప్రతి కార్యకర్తకు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అభివృద్ధి చెందుతుందన్నారు. వికలాంగులకు వృద్ధులకు, వితంతువులకు రెండు వేల నుంది మూడు వేల రూపాయలు ఇచ్చే ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పనె్నండుకు పనె్నండు సీట్లు గెలవడం, టీఆర్‌ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దొంగ రాజకీయాలు, పూటకోమాట మానుకోవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సవాలు విసిరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ కరీం పాషా, ఎంపీపీ కొప్పుల కృష్ణయ్య, జిల్లా నాయకులు కటికం సత్తయ్య గౌడ్, బుర్ర సుధాకర్, వంగాల సాహదేవ రెడ్డి, యాదయ్య, సంజీవ, శ్రీను, వెంకన్న, సైదులు, శ్రీ్ధర్ రావు, క్షేత్రయ్య, కృష్ణయ్య తదితరులున్నారు.