నల్గొండ

ఉమ్మడి జిల్లాలో 65 మంది నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆరో రోజు శనివారం 65మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో యువ తెలంగాణ పార్టీ నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి, బీఎల్‌ఎఫ్ నుండి బెల్లి కృష్ణ, స్వతంత్ర అభ్యర్ధిగా పట్నం కమలమ్మ, కొండా లక్ష్మణ్, గణేష్ నాయక్‌లు నామినేషన్లు వేశారు. నల్లగొండలో బిఎల్‌పినుండి అక్కినపల్లి మీనయ్య, టీఆర్‌ఎస్ నుండి కంచర్ల భూపాల్‌రెడ్డి, స్వతంత్రులుగా మహ్మద్ మజీద్, గండికోట వెంకటలక్ష్మణ్, జనిగల రాములు నామినేషన్లు వేశారు. హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్దిగా నామినేషన్లు దాఖలు చేశారు.

ఇలా అయితే.. పనిచేయాలా.. వద్దా..?
* ఉత్తమ్‌ను నిలదీసిన తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు
సూర్యాపేట, నవంబర్ 17: తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్‌ను అద్దంకి దయాకర్‌కు కేటాయిచడంతో ఆగ్రహాంతో ఉన్న కాంగ్రెస్‌నేత డాక్టర్ వడ్డెపల్లి రవి వర్గీయులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి హజరై రాత్రి హైదరాబాద్‌కు వెళ్తూ జిల్లాకేంద్రం శివారులోని ఓహోటల్ వద్ద ఉత్తమ్ ఆగుతున్నారన్న సమాచారం అందుకున్న తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడకు చేరుకొని ఈ విషయంపై ఉత్తమ్‌ను ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వారికి కాకుండా స్దానికంగా ఉండని అద్దంకి దయాకర్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వడ్డెపల్లి రవికి టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, ఇలాంటి పరిస్థితులు ఉంటే తాము పార్టీలో పనిచేయాలా, వద్దా అంటూ పశ్నించారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలను ఓపికగా విన్న ఉత్తమ్ వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.
మును‘గోడు’ తీరుస్తా
* కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నాంపల్లి, నవంబర్ 17: మునుగోడు ప్రజల కష్టాలు, బాధలు తీర్చడానికి కంకణం కట్టుకుని ఎన్నికల బరిలోకి దిగానని ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కిష్టరాంపల్లి ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన లక్ష్మణాపురం గ్రామ రైతులకు ఎకరానికి 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఇల్లు నిర్మిస్తామని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, ఎస్‌డబ్ల్యూ లింగొటం, వడ్డెపల్లి, నాంపల్లి తదితర గ్రామాల్లో హోరాహోరిగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు కార్యకర్తలు నాయకులు డప్పు చప్పుళ్లతో కళకారులు నృత్యాలతో కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడుకు ఎన్నో రోజులనుండి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ అవకాశం ఇప్పుడు భగవంతుడు కల్పించాడన్నారు. గత టీఆర్‌ఎస్ పాలనలో కేసఆర్ అనేక తప్పుడు హామీలనిచ్చి ప్రజలను నట్టేట మోసం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్లకు, తెలంగాణలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని డిపాజిట్ కూడా రాదన్నారు. చెర్లగూడెం కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పని పూర్తి చేసి సాగు నీరందిస్తామన్నారు.