నల్గొండ

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో మిర్యాలగూడ, కోదాడలపై సస్పెన్స్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ శనివారం మరో రెండు స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గం నుండి జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌ను, తుంగతుర్తి(ఎస్సీ) నుండి అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ అభ్యర్ధులుగా ప్రకటించింది. గత 2014ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కారణంగా బాలునాయక్ అప్పట్లో తన సిట్టింగ్ స్థానాన్ని సీపీఐకి వదిలేశారు. అందుకు కాంగ్రెస్ ఆయనను జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేలా చేసింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో బాలునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం సీపీఐ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్. రవీంద్రకుమార్ సైతం టీఆర్‌ఎస్‌లో చేరి ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ నుండి దేవరకొండ టికెట్ దక్కని బాలునాయక్ తిరిగి సొంత గూటికి కాంగ్రెస్‌లో చేరారు. దేవరకొండ నుండి కాంగ్రెస్ టికెట్ కోసం బాలునాయక్‌తో పాటు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆర్. జగన్‌లాల్‌నాయక్, రేవంత్‌రెడ్డి అనుఛరుడు కేతావత్ బిల్యానాయక్‌లు పోటీ పడ్డారు. చివరకు బాలునాయక్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. దీంతో నిరాశకు గురైన బిల్యానాయక్ బిఎల్‌ఫ్‌లో చేరి ఆ పార్టీ మద్ధతుతో ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసిన లాలూనాయక్ స్థానంలో ఈ ఎన్నికల్లో ఆర్. రవీంద్రకుమార్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో లాలూనాయక్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజులకే లాలూనాయక్ ఆ పార్టీకి కూడా గుడ్‌బై కొట్టి బీజేపీలో చేరారు. బీజేపీ సైతం లాలూనాయక్‌ను కాదని కల్యాణ్‌రామ్‌నాయక్‌ను తమ అభ్యర్ధిగా ప్రకటించింది.
రెండు పార్టీల్లో రెండు సీట్లపై సస్పెన్స్
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ అభ్యర్ధి ఖరారులో, టీఆర్‌ఎస్‌లో కోదాడ అభ్యర్ధి ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. మిర్యాలగూడ స్థానాన్ని తన కుమారుడు రఘవీరారెడ్డికి ఇవ్వాలన్న కె.జానారెడ్డి ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసీటును మహాకూటమి సీట్ల సర్ధుబాటులో భాగంగా టీజెఎస్‌కు ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే టీజెఎస్ నుండి గవ్వా విద్యాధర్‌రెడ్డికి కాకుండా తాను సూఛించిన తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్‌రెడ్డికి వారికి టికెట్ ఇస్తేనే గెలుపుకు సహకరిస్తానంటు జానారెడ్డి మెలిక పెట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం మిర్యాలగూడ సీటు విషయమై నిర్ణయాన్ని మరో రోజుకు వాయిదా వేసింది. ఈ సీటు విషయమై విద్యాధర్‌రెడ్డి వర్గీయులు శనివారం రాత్రి కోదండరామ్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ పరిణామాలు విజయేందర్‌రెడ్డికే మిర్యాగూడ టీజెఎస్ టికెట్ దక్కవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్ నుండి కోదాడ అభ్యర్ధి ఎంపికలో సైతం సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.చందర్‌రావుతో పాటు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మాజీ నేత బొల్లం మల్లయ్యయాదవ్‌లలో ఎవరికి కేసీఆర్ టికెట్ ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
డీఎల్‌ఓలు చిత్తశుద్ధితో పనిచేయాలి
లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 23నుండి డిసెంబర్ 1నాటికి ఓటరు గుర్తింపు కార్డులను పంపిణి చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని పోలింగ్ బూత్ లలో వౌళిక వసతుల ఏర్పాట్ల పట్ల తాను సంతృప్తి చెందానని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ లను ఆయన అభినందించారు. అంతకుముందు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ బూత్‌లను వౌళిక వసతులపై వివరించారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడ బెల్టు షాపు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీకెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ శేఖర్ రెడ్డి, ఐసీడీస్ పీడీ కృష్ణవేణీ, డీఎస్పీ మహేశ్యర్, ఏడీఏ విజయేందర్ రెడ్డి, తహసిల్దార్ సునందా, ఎంపీడీవో మమత తదితరులు పాల్గొన్నారు