నల్గొండ

ఇలా అయితే.. పనిచేయాలా.. వద్దా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
నామినేషన్ దాఖలు
హుజూర్‌నగర్, నవంబర్ 17: హుజూర్‌నగర్ తాజా మాజీ ఎంయల్‌ఏ టిపిసిసి అధ్యక్షుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం స్థానిక తహశీలుదారు కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి సమక్షంలో రెండు సెట్లు నామినేషన్‌లు దాఖలు చేశారు. అంతకు ముందు ఆయన హైద్రాబాద్ నుండి నేరుగా పట్టణ శివారులోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం వేలాది మంది కాంగ్రెసు కార్యకర్తలు, మిత్రపక్షమైన టిడిపి, సిపిఐ, టిజెయస్ కార్యకర్తల భారీ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 7 మండలాల నుండి భారీ ఎత్తున కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హుజూర్‌నగర్ చేరుకోవటంతో పట్టణంలో ఎక్కడి కక్కడ ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు ఇబ్బందులు పడ్డారు. ఆయన వెంట సతీమణి కోదాడ తాజా మాజీ ఎంయల్‌ఏ యన్ పద్మావతీరెడ్డి, సీనియర్ నాయకులు వంగాల స్వామిగౌడ్, ఎరగాని నాగన్న, అరుణ్‌కుమార్, అట్లూరి హరిబాబు, చావా కిరణ్మయి తదితరులు ఉన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ కుటుంబం మధ్యనే: పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
కోట్లాది మంది పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అణచివేతకు గురి చేసిన కెసిఆర్ కుటుంబాన్ని ఈఎన్నికలలో కెసిఆర్ కుటంబాన్ని తరిమి కొట్టాలని టిపిసిసి అధ్యక్షుడు యన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. శనివారం హుజూర్‌నగర్‌లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఈ ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపి, సిపిఐ, టిజెయస్ కలిసి పీపుల్స్ ప్రంటుగా పోటీ చేస్తున్నాయని ఎన్నికల అనంతరం కూడా కామన్ మినిమం కార్యక్రమం
అమలు చేస్తాయని అన్నారు. గత 10 సంవత్సరాలలో ఈ ప్రాంతాన్ని కనివిని ఎరుగని రీతిలో అభివృద్ది చేశానని రానున్న ఎన్నికలో 70, 80 వేల మెజార్టీతో గెలిపించాలని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చటానికి పీపుల్స్ ప్రంటు కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించిందని ఆచార్య కోదండరామ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారని అన్నారు. కెసిఆర్ చేసిన వాగ్దానాలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, 12 శాతం రిజర్వేషన్‌లు, ఇంటికో ఉద్యోగం ఏవీ అమలు చేయదని రైతుల చేతులకు కాళ్లకు బేడీలు వేయించి తిప్పారని ఉత్తమ్ విమర్శించారు. టిఆర్‌యస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని , పాతర వేయాలని యస్‌సి, యస్‌టి, బిసి, ముస్లీం వర్గాలను అణచివేతకు గురి చేశారని మంద కృష్ణను రెండు సార్లు, కోదండరామ్‌ను రెండు సార్లు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. పీపుల్స్ ప్రంటు అధికారంలోకి రాగానే రైతుల 2లక్షల రుణాలు మాజీ చేస్తామని, 10 లక్షల మంది నిరుద్యోగులకు భృతి ఇస్తామని, మహిళా సంఘాల భవనాలకు 10లక్షలు, సంఘాలకు 5 లక్షలు, పేదలకు సన్న బియ్యంతో పాటు, రేషన్ కార్డుపై అన్ని వస్తువులు, యస్‌సి,యస్‌టిలకు 200 విద్యుత్ యూనిట్లు ఉచితంగా అందిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం బందిపోటు దొంగల్లా దోచుకున్నారని, మిషన్ భగీరధ క్రింద ఒక్క ఇంటికి నల్లా ఇవ్వలేదని, ఒక్క ఎకరానికి అదనంగా నీరు అందించలేదని అసలు సియం సచివాలాయానికే రాలేదని, అత్యంత విలాసవంతమైన కార్లలో, విమానాలలో, భవనాలలో నివాసం చేస్తున్నాడని ఉత్తమ్ తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి కోదాడ తాజా మాజీ ఎంయల్‌ఏ యన్ పద్మావతీరెడ్డి, కాంగ్రెసు, టిడిపి, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో
మిర్యాలగూడ,
కోదాడలపై సస్పెన్స్..!
* మరో రెండు సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
* దేవరకొండలో బాలునాయక్, తుంగతుర్తిలో అద్దంకిలకు ఛాన్స్
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ శనివారం మరో రెండు స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. దేవరకొండ (ఎస్టీ) నియోజకవర్గం నుండి జడ్పీ చైర్మన్ ఎన్. బాలునాయక్‌ను, తుంగతుర్తి(ఎస్సీ) నుండి అద్దంకి దయాకర్‌ను కాంగ్రెస్ అభ్యర్ధులుగా ప్రకటించింది. గత 2014ఎన్నికల్లో సీపీఐతో పొత్తు కారణంగా బాలునాయక్ అప్పట్లో తన సిట్టింగ్ స్థానాన్ని సీపీఐకి వదిలేశారు. అందుకు కాంగ్రెస్ ఆయనను జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యేలా చేసింది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో బాలునాయక్ టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం సీపీఐ నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్. రవీంద్రకుమార్ సైతం టీఆర్‌ఎస్‌లో చేరి ప్రస్తుత ముందస్తు ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. దీంతో టీఆర్‌ఎస్ నుండి దేవరకొండ టికెట్ దక్కని బాలునాయక్ తిరిగి సొంత గూటికి కాంగ్రెస్‌లో చేరారు. దేవరకొండ నుండి కాంగ్రెస్ టికెట్ కోసం బాలునాయక్‌తో పాటు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌చార్జి ఆర్. జగన్‌లాల్‌నాయక్, రేవంత్‌రెడ్డి అనుఛరుడు కేతావత్ బిల్యానాయక్‌లు పోటీ పడ్డారు. చివరకు బాలునాయక్‌కే కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కింది. దీంతో నిరాశకు గురైన బిల్యానాయక్ బిఎల్‌ఫ్‌లో చేరి ఆ పార్టీ మద్ధతుతో ఎన్నికల బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేశారు.
మరోవైపు ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ నుండి పోటీ చేసిన లాలూనాయక్ స్థానంలో ఈ ఎన్నికల్లో ఆర్. రవీంద్రకుమార్‌కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో లాలూనాయక్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. కొద్దిరోజులకే లాలూనాయక్ ఆ పార్టీకి కూడా గుడ్‌బై కొట్టి బీజేపీలో చేరారు. బీజేపీ సైతం లాలూనాయక్‌ను కాదని కల్యాణ్‌రామ్‌నాయక్‌ను తమ అభ్యర్ధిగా ప్రకటించింది.
రెండు పార్టీల్లో రెండు సీట్లపై సస్పెన్స్
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో మిర్యాలగూడ అభ్యర్ధి ఖరారులో, టీఆర్‌ఎస్‌లో కోదాడ అభ్యర్ధి ఖరారులో సస్పెన్స్ కొనసాగుతుంది. మిర్యాలగూడ స్థానాన్ని తన కుమారుడు రఘవీరారెడ్డికి ఇవ్వాలన్న కె.జానారెడ్డి ప్రతిపాదనను తిరస్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఈసీటును మహాకూటమి సీట్ల సర్ధుబాటులో భాగంగా టీజెఎస్‌కు ఇచ్చేందుకు సిద్ధపడింది. అయితే టీజెఎస్ నుండి గవ్వా విద్యాధర్‌రెడ్డికి కాకుండా తాను సూఛించిన తన వియ్యంకుడి సోదరుడైన మేరెడ్డి విజయేందర్‌రెడ్డికి వారికి టికెట్ ఇస్తేనే గెలుపుకు సహకరిస్తానంటు జానారెడ్డి మెలిక పెట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం మిర్యాలగూడ సీటు విషయమై నిర్ణయాన్ని మరో రోజుకు వాయిదా వేసింది. ఈ సీటు విషయమై విద్యాధర్‌రెడ్డి వర్గీయులు శనివారం రాత్రి కోదండరామ్ ఇంటి ముందు నిరసనకు దిగారు. ఈ పరిణామాలు విజయేందర్‌రెడ్డికే మిర్యాగూడ టీజెఎస్ టికెట్ దక్కవచ్చన్న సంకేతాలిస్తున్నాయి. ఇక టీఆర్‌ఎస్ నుండి కోదాడ అభ్యర్ధి ఎంపికలో సైతం సస్పెన్స్ కొనసాగుతుంది. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వి.చందర్‌రావుతో పాటు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ మాజీ నేత బొల్లం మల్లయ్యయాదవ్‌లలో ఎవరికి కేసీఆర్ టికెట్ ఇవ్వనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
డీఎల్‌ఓలు చిత్తశుద్ధితో పనిచేయాలి
లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 23నుండి డిసెంబర్ 1నాటికి ఓటరు గుర్తింపు కార్డులను పంపిణి చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మండలంలోని పోలింగ్ బూత్ లలో వౌళిక వసతుల ఏర్పాట్ల పట్ల తాను సంతృప్తి చెందానని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ లను ఆయన అభినందించారు. అంతకుముందు కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ జిల్లాలోని పోలింగ్ బూత్‌లను వౌళిక వసతులపై వివరించారు. ఎస్పీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడ బెల్టు షాపు లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో సీసీకెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ శేఖర్ రెడ్డి, ఐసీడీస్ పీడీ కృష్ణవేణీ, డీఎస్పీ మహేశ్యర్, ఏడీఏ విజయేందర్ రెడ్డి, తహసిల్దార్ సునందా, ఎంపీడీవో మమత తదితరులు పాల్గొన్నార

తెలంగాణ సంస్కృతిని
పరిరక్షించిన జాగృతి
* మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 17: సమైక్య పాలకుల కుట్రలతో కనుమరుగవుతున్న దశలో ఉన్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో తెలంగాణ జాగృతి సంస్థ చేసిన కృషి మరువలేనిదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు. శనివారం జిల్లా కేంద్రంలోని జీవీవీ ఫంక్షన్‌హాల్లో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని ఉపేందర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన సంస్థ ఉమ్మడి జిల్లా సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైఖ్య పాలకులు తెలంగాణ వనరులు, ఉద్యోగాలు, నీళ్లు దోచుకోవడంతోపాటు చివరికి సంస్కృతి, సంప్రదాయాలను కూడా దెబ్బతీసేందుకు యత్నించారన్నారు. ఈ దశలో మలిదశ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఆవిర్భవించిన జాగృతి సంస్థ ఆ దిశగా పనిచేసి ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మన సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ, బోనాల పండుగలను భారీగా నిర్వహించి తెలంగాన ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీ ఆర్ ప్రభుత్వం బోనాలు, బతుకమ్మ పండుగలకు ప్రాధాన్యతనిచ్చి రాష్ట్ర పండుగలుగా గుర్తించి ప్రభుత్వ పరంగా నిర్వహించేందుకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. తెలంగాన జాగృతి ఇదే పంథాను కొనసాగిస్తూ తెలంగాణ సంస్కృతిని కాపాడాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి కార్యకర్తలు తెలంగాణ పోరాటం చేసిన టీ ఆర్ ఎస్‌ను గెలిపించేందుకు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాగృతి కళా బృందం కో ఆర్డినేటర్ కోదారి శ్రీను జన్మదినం సందర్భంగా కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు మేడ రాజీవ్‌సాగర్, ఉమ్మడి జిల్లా కన్వీనర్ బోనగిరి దేవేందర్, నాయకులు లీల, ఉమామహేశ్వరి, చైతన్య తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లాలో
65 మంది నామినేషన్లు
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, నవంబర్ 17: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆరో రోజు శనివారం 65మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. భువనగిరి నియోజకవర్గంలో యువ తెలంగాణ పార్టీ నుండి జిట్టా బాలకృష్ణారెడ్డి, బీఎల్‌ఎఫ్ నుండి బెల్లి కృష్ణ, స్వతంత్ర అభ్యర్ధిగా పట్నం కమలమ్మ, కొండా లక్ష్మణ్, గణేష్ నాయక్‌లు నామినేషన్లు వేశారు. నల్లగొండలో బిఎల్‌పినుండి అక్కినపల్లి మీనయ్య, టీఆర్‌ఎస్ నుండి కంచర్ల భూపాల్‌రెడ్డి, స్వతంత్రులుగా మహ్మద్ మజీద్, గండికోట వెంకటలక్ష్మణ్, జనిగల రాములు నామినేషన్లు వేశారు. హుజూర్‌నగర్‌లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్దిగా నామినేషన్లు దాఖలు చేశారు.
సూర్యాపేట, నవంబర్ 17: తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్‌ను అద్దంకి దయాకర్‌కు కేటాయిచడంతో ఆగ్రహాంతో ఉన్న కాంగ్రెస్‌నేత డాక్టర్ వడ్డెపల్లి రవి వర్గీయులు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. శనివారం హుజూర్‌నగర్‌లో జరిగిన నామినేషన్ కార్యక్రమానికి హజరై రాత్రి హైదరాబాద్‌కు వెళ్తూ జిల్లాకేంద్రం శివారులోని ఓహోటల్ వద్ద ఉత్తమ్ ఆగుతున్నారన్న సమాచారం అందుకున్న తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు అక్కడకు చేరుకొని ఈ విషయంపై ఉత్తమ్‌ను ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే వారికి కాకుండా స్దానికంగా ఉండని అద్దంకి దయాకర్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వడ్డెపల్లి రవికి టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని, ఇలాంటి పరిస్థితులు ఉంటే తాము పార్టీలో పనిచేయాలా, వద్దా అంటూ పశ్నించారు. నాయకులు, కార్యకర్తలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలను ఓపికగా విన్న ఉత్తమ్ వారికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు.
మును‘గోడు’ తీరుస్తా
* కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
నాంపల్లి, నవంబర్ 17: మునుగోడు ప్రజల కష్టాలు, బాధలు తీర్చడానికి కంకణం కట్టుకుని ఎన్నికల బరిలోకి దిగానని ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కిష్టరాంపల్లి ప్రాజెక్టులో సర్వస్వం కోల్పోయిన లక్ష్మణాపురం గ్రామ రైతులకు ఎకరానికి 10లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి ఇల్లు నిర్మిస్తామని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం నాంపల్లి మండలంలోని లక్ష్మణాపురం, ఎస్‌డబ్ల్యూ లింగొటం, వడ్డెపల్లి, నాంపల్లి తదితర గ్రామాల్లో హోరాహోరిగా జోరుగా ప్రచారం నిర్వహించారు. ఆయనకు కార్యకర్తలు నాయకులు డప్పు చప్పుళ్లతో కళకారులు నృత్యాలతో కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడుకు ఎన్నో రోజులనుండి సేవ చేయాలని నిర్ణయించుకున్నానని, ఆ అవకాశం ఇప్పుడు భగవంతుడు కల్పించాడన్నారు. గత టీఆర్‌ఎస్ పాలనలో కేసఆర్ అనేక తప్పుడు హామీలనిచ్చి ప్రజలను నట్టేట మోసం చేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి కూసుకుంట్లకు, తెలంగాణలో కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని డిపాజిట్ కూడా రాదన్నారు. చెర్లగూడెం కిష్టరాంపల్లి రిజర్వాయర్ల పని పూర్తి చేసి సాగు నీరందిస్తామన్నారు.
బీఎల్‌ఎఫ్‌తోనే సామాజిక న్యాయం
* సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
చౌటుప్పల్, నవంబర్ 17: బీఎల్‌ఎఫ్ అభ్యర్థుల విజయంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు అన్నారు. చౌటుప్పల్‌లో శనివారం సీపీఎం మండల, గ్రామ కమిటీలు, ప్రజాప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీపీఎం బలపర్చిన బీఎల్‌ఎఫ్ అభ్యర్థి గోశిక కరుణాకర్ విజయం కోసం ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తూ ఎన్నికలకు రావడం దుర్మార్గమైన చర్య అన్నారు. అధికారం కోసం దక్కించుకునేందుకు మళ్లీ హామీల వర్షం కురిపిస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థులను ఓడించి బీఎల్‌ఎఫ్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. అందుకోసం ఇంటింటి ప్రచారాలను ముమ్మరం చేయాలన్నారు. పాలకుల వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో బూర్గు కృష్ణారెడ్డి, రొడ్డ అంజయ్య, ఎం.డి.పాషా పాల్గొన్నారు.