నల్గొండ

మహాకూటమి ఆటలు చెల్లవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్గులపల్లి, నవంబర్ 18: సంక్షేమ పధకాలతో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నల్గగొండ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల, మాడ్గులపల్లి, చెరుపల్లి, దాచారం గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కంటివెలుగు పధకం వలన వృద్ధులకు కంటి ఆపరేషన్లు, కంటి అద్దాలు ఇవ్వడం జరిగిందన్నారు. రైతుబంధు, రైతుబీమా పధకాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. మిషన్ కాకతీయ పధకం వలన చెరువులలో నీరునింపి రైతులకు మేలు చేసిందన్నారు. రైతులకు 24గంటల కరెంట్, కళ్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు, ఒంటరి మహిళ పెన్షన్లు, కెసిఆర్ కిట్ ప్రజలకు మేలు చేసిందన్నారు. బంగారు తెలంగాణ కెసిఆర్‌తోనే సాధ్యమన్నారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి అమలుచేయని పధకాలను రాష్ట్రంలో పేదల కోసం కెసిఆర్ అమలుచేస్తున్నారన్నారు. రైతుసంక్షేమమే టిఆర్‌ఎస్ పార్టీ ద్యేయమన్నారు. రైతులను బాధల నుండి విముక్తిచేయాడానికి ఏర్పరిచినదే రైతుబంధు పధకమన్నారు.ఈకార్యక్రమంలో బి.నరేందర్‌రెడ్డి, గోవర్ధన్, ఎంపిటిసి రేణుక నరేందర్‌రెడ్డి, వివేక్‌రెడ్డి, స్వర్ణం శ్రీకాంత్, కట్ట సిద్దార్ధరెడ్డి, కె.వెంకన్న, నర్సింహ, లక్ష్మయ్య పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా ఉత్తమ్‌ను గెలిపించాలి
కోదాడ, నవంబర్ 18: కోదాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఉత్తమ్ పద్మావతి మట్లాడుతూ మీ అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రజా కూటమి అభ్యర్థిగా సోమవారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. తన గెలుపుకు పార్టీలకు అతీతంగా అందరూ కలసి కృషి చేయాలని, అందరి సహాకారంతో కోదాడ యమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తాను యమ్మెల్యేగా గెలిస్తే అందరినీ ఒకే పార్టీ చూస్తానని, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. సోమవారం నామినేషన్ వేసే క్రమంలో అందరూ ర్యాలీలో పాల్గొనాలని కోరారు. సమావేశంలో దండా వీరభద్రం, తొండపు సతీష్, దొడ్డా నారాయణరావు, గన్నా చంద్రశేఖర్, నంబూరి సూర్యం, వంగవేటి రామారావు, ఓరుగంటి ప్రభాకర్, సామినేని ప్రమీల, చందా విజయ్, అనంతుల ఆంజనేయులు, సాతులూరి గువరయ్య, సంపెట రవి పాల్గొన్నారు.