నల్గొండ

నల్లగొండ నుండే వారసత్వ, కుటుంబ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూర్‌నగర్, నవంబర్ 19: ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కుటుంబ పాలన అనే అర్హత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేదని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండే కాంగ్రెస్ పార్టీలో కుటుంబ, వారసత్వ పాలన ఆరంభమైనదని దుయ్య బట్టారు. సోమవారం హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ ర్యాలీలో గుత్తా మాట్లాడుతూ ఉత్తమ్ తన భార్య పద్మావతికి, తన బంధువు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి భువనగిరిలో, కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ, మునుగోడులో టికెట్లు ఇప్పించుకున్నారని, జానారెడ్డి తన కుమారుని కోసం ఢిల్లీలో పడరాని పాట్లు పడ్డారని విమర్శించారు. మహా కూటమి కేవలం కేసీఆర్‌ను గద్దె దించడం పేరిట మాత్రమే ఏర్పడింది తప్ప దానికి దిశా దశ, లక్ష్యం లేదని గుత్తా దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా నీళ్ల దోపిడీ జరగకుండా సీఎం కేసీఆర్ గట్టి చర్యలు తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ ద్రోహులతో మహాకూటమి ఏర్పడిందని విమర్శించారు.
ఉత్తమ్ రాజకీయ జీవితం నేటితో భూ స్థాపితం: సైదిరెడ్డి
హుజూర్‌నగర్ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ జీవితం నేటితో భూ స్థాపితం కానున్నదని టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య సమక్షంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మాట్లాడుతూ నిత్యం అవాకులు చెవాకులు పేలుతున్న ఉత్తమ్ ఈ ఎన్నికలలో ఓడిపోవడం ఖాయమని, ఇందుకు ర్యాలీకి హాజరైన ప్రజావాహినే నిదర్శనమన్నారు. ఈసారి కృష్ణా పరివాహక తీరంలో టీఆర్‌ఎస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు. తనకు హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ టికెట్ ఇచ్చి ఉత్తమ్‌ను ఓడించే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానని సైదిరెడ్డి అన్నారు. ఉత్తమ్ గత పదేళ్లుగా అవినీతి, అక్రమాలు, బెదరింపులు, అక్రమ కేసులు పెట్టించి అరాచకాలు సృష్టించారని, నూతన ప్రభుత్వం రాగానే అన్ని పరిష్కరిస్తామని ఆయన చెప్పారు.