నల్గొండ

సాగర్‌లో జానారెడ్డి చేసింది శూన్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడమనూర్, నవంబర్ 19: నాగార్జునసాగర్‌లో కాంగ్రేస్ నాయకులు జానారెడ్డి చేసిన అభివృద్ధి శూన్యమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. సోమవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల నర్సింహయ్యచే నామినేషన్ వేయించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం ప్రాతినిద్యం వహించి ముఖ్యమంత్రి అభ్యర్ధినంటు గొప్పలు చెప్పుకుంటున్న జానారెడ్డి తన సొంత నియోజకవర్గంలోనే అభివృద్ధి చేసుకోలేకపోయారన్నారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత పెండింగ్‌లో ఉన్న అనేక పనులను తమ ప్రభుత్వం పూర్తి చేసిందని లింగయ్యయాదవ్ అన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుసంక్షేమానికి రైతుబంధు, రైతుబీమా పధకాలతో పాటు వృద్ధులు, వింతంతువులకు వెయ్యిరూపాయలు, వికాలాంగులకు 15వందలు పెన్షన్ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అని, అంతేకాకుండా షాదీముబారక్ లాంటి పధకాలను ప్రవేశపెట్టిందని, సాగునీరు అందించి ఆయకట్టును పెంచగలిగామని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో నాగార్జుసాగర్ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రేస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు. అంతకు ముందు నోముల నర్సింహయ్య తమ పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి రెండవసారి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయడం జరిగింది. ఈసమావేశంలో మాజీ శాసనసభ్యుడు గుండెబోయిన రాంమూర్తియాదవ్, ఆప్కాబ్ మాజీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి, పార్టీ నాయకులు ఎంసి కోటిరెడ్డి, రామచందర్‌నాయక్, గడ్డంపల్లి రవీందర్‌రెడ్డి, బిక్షనాయక్, బొల్లం శ్రీనివాస్‌యాదవ్, బి.రవిలు పాల్గొన్నారు.