నల్గొండ

కోదాడలో గులాబి జెండా ఎగురవేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోదాడ, నవంబర్ 19: కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ గెలుపు ఖాయమని అందరి సహకారంతో గులాబీ జెండా ఎగురవేస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే చందర్రావు నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి 4 సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్ పార్టీ చేసి చూపించిందని, ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీని తమ ఇంటి పార్టీలా భావిస్తున్నారని అన్నారు. ఇంకా అభివృద్ధి జరగాలంటే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. మోతె మండలం నుండి సుమారు 200 మంది కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డికి తగిన న్యాయం చేస్తామని, అందరూ సర్దుకుపోయి పార్టీ గెలుపుకు కృషిచేస్తారని తెలిపారు.

సంక్షేమ పథకాలే కూసుకుంట్లను గెలిపిస్తాయి
ఎంపీ బూర నర్సయ్య గౌడ్
చండూరు, నవంబర్ 19: ఈ ఎన్నికల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తాయని ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌లు అన్నారు. సోమవారం ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి వీరిరువు ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని వారు. అభివృద్ధి కొనసాగాలంటే తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి వివిధ అన్ని ప్రాంతాలనుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెద్దగోని వెంకన్న, కోడి వెంకన్న, మునగాల నారాయణ రావ్ తదితరులు హాజరయ్యారు.

మహాకూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయం
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి
చండూరు, నవంబర్ 19: ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సోమవారం తన నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ సెంటిమెంట్‌తో అతి కష్టం మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని అనంతరం హామీలను అమలు చేయడంలో విఫమైందన్నారు. ఈ ఎన్నికల్లో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మహాకూటమి అభ్యర్థులతో కలసి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునగాల వెంకటేశ్వర్ రావు, సీపీఐ నాయకులు నెలికంటి సత్యం మరియు కాంగ్రెస్ నాయకులు నారబోయిన రవి, వేనేపల్లి వెంకటేశ్వర్ రావ్, కావలి ఆంజనేయులు, సుజా ఉద్దిన్, కోడి గిరి, డీ. వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.