నల్గొండ

ప్రగతి భవన్, ఫాంహౌస్‌లకే కేసీఆర్ పాలన పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 20: ప్రగతి భవన్, ఫాంహౌస్‌లకే కేసీఆర్ పాలన పరిమితమైందని, కాంగ్రెస్‌ను గెలిపించాలన్న కసి ప్రజల్లో పెరిగిందని, త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలోని 4, 5 వార్డుల్లో ఆయన సతీమణి సబితారెడ్డితో కలిసి యాటకన్నారెడ్డి కాలనీ, హనుమాన్ నగర్, రవీంద్ర నగర్, బీట్ మార్కెట్, రామగిరి తదితర ప్రాంతాలలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు కాళేశ్వరం, సిరిసిల్ల, జగిత్యాల మీద దృష్టి తప్ప ఏ ప్రాంతాల గురించి పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ మున్సిపాల్టీలకు నిధులు విడుదల చేయడంలో విఫలం చెందారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం చెంది నేడు మరోమారు ధన బలంతో, మాటల గారడీతో గద్దెనెక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని కాంగ్రెస్‌ను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమాదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, రాష్ట్ర నాయకులు వంగాల స్వామి గౌడ్, జడ్పీటీసీ రాధ, గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కవిత, నర్సమ్మ, ధనలక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి, నాగమణి, అల్లె సుభాష్ పాల్గొన్నారు.

పోలింగ్ బూత్‌లను పరిశీలించిన కేంద్ర పరిశీలకుడు
ఆలేరు, నవంబర్ 20: ఆలేరు శాసనసభ పరిధిలోని పలు పోలింగ్ బూత్‌లను కేంద్ర పరిశీలకుడు తేజ్ కపూర్ సింగ్ పరిశీలించారు. అంతకుముందు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలిస్తు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్, ఆర్‌వో ఉపేందర్ రెడ్డి, ఎన్నికల సహాయాధికారి శ్యాం సుందర్ రెడ్డి తదితరులున్నారు.

కాంగ్రెస్ పాలనలోనే పేట అభివృద్ధి
* మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి
సూర్యాపేట, నవంబర్ 20: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సూర్యాపేట అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం తెల్లవారుజామున జిల్లా కేంద్రంలో మార్నింగ్ వాక్ నిర్వహించారు. సద్దల చెరువు కట్టపై వాకర్స్‌ను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ యార్డులో వ్యాపారులు, ప్రజలను కలుసుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే మాయమాటలతో అధికారం చేపట్టిన కేసీఆర్ ప్రజలను మోసగించి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని ఆరోపించారు. సూర్యాపేట అభివృద్ధితో పాటు తెలంగాణ అభ్యున్నతి కోసం మహాకూటమిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కొప్పుల వేణారెడ్డి, అంగిరేకుల నాగార్జున, చంచల శ్రీను, అంజద్ అలీ తదితరులు పాల్గొన్నారు.

సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన నాయిని
దేవరకొండ, నవంబర్ 20: ఎన్నికల ప్రచార భాగంలో భాగంగా బుదవారం దేవరకొండ పట్టణంలో జరిగే బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్న నేపధ్యంలో మంగళవారం హోంమత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ అభ్యర్థి రవీంద్రకుమార్ ఏర్పాట్లను పరిశీలించారు. సభకు దాదాపు 50 వేలకు పైగా కార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న నేపధ్యంలో హాజరయ్యే వారికి ఏర్పాటు చేస్తున్న సభ సరిపోతుందా లేదా అని నాయకులను, అధికారులకు అడిగి తెలుసుకున్నారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని కోరారు. సభ ఏర్పాట్లను పరిశీలించిన వారిలో జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్, వైస్ చైర్మన్ నల్లగాసు జాన్‌యాదవ్, నాయకులు చీదళ్ళ గోపి, వేముల రాజు, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.