నల్గొండ

నేడు జిల్లాలో కేసీఆర్ సభలు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆపద్ధర్మ సీఎం, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు బుధవారం టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి రానుండటం గులాబీ దండులో కదనోత్సహం రేకెత్తిస్తుంది. గత ఆక్టోబర్ 4న నల్లగొండలో ప్రజాశీర్వాద సభకు హాజరైన కేసీఆర్ 48 రోజుల వ్యవధిలో జిల్లాలో మరోసారి పర్యటిస్తూ నేడు భువనగిరి, నకిరేకల్, దేవరకొండ ప్రజాశీర్వాద సభలకు హాజరవుతుండటం విశేషం. భువనగిరి, నకిరేకల్(ఎస్సీ), దేవరకొండ(ఎస్టీ) నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థులు పైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, ఆర్.రవీంద్రకుమార్‌ల గెలుపు కోరుతూ ఆయన ఈ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజాశీర్వాద సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. నల్లగొండ ప్రజాశీర్వాద సభలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని, టీ.కాంగ్రెస్, టీజేఎస్ నాయకులను తీవ్రంగా దుయ్యబట్టిన కేసీఆర్ నేటి సభల్లో ఇంకేస్థాయిలో వారిపై విరుచుకపడనున్నారోనన్న ఆసక్తి నెలకొంది.
అధికార సాధనలో జిల్లాలో గెలుపునకు కేసీఆర్ దృష్టి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ స్థానాలు సూర్యాపేట, తుంగతుర్తి(ఎస్సీ), నకిరేకల్(ఎస్సీ), ఆలేరు, భువనగిరి, మునుగోడు నియోజకవర్గాల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మెజార్టీ స్థానాలు గెలువాలని భావిస్తుంది. జిల్లాలో బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాకూటమి నుండి టీడీపీ, సీపీఐ, టీజేఎస్ శ్రేణులు సైతం ఈ ఎన్నికల్లో తోడవ్వడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు సాధనకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్తర తెలంగాణ నుండి గత ఎన్నికల్లో మెజార్టీగా ఉన్న స్థానాల్లో ఈ ఎన్నికల్లో ఏవైనా సీట్లు కోల్పోయినా ఆ లోటును అధిగమించేందుకు అధికార సాధనకు దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుండి గత ఎన్నికల్లో కంటే అదనంగా స్థానాలు గెలుచుకోవాలని టీఆర్‌ఎస్ వ్యూహాంగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ సీనియర్లు కే.జానారెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి వారిని ఓడిస్తేనే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆరుసీట్ల మార్కు దాటుతామని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ఈ దిశగా ముందు తమ సిట్టింగ్ స్థానాలను కాపాడుకుంటూనే కాంగ్రెస్ సీనియర్ల నియోజకవర్గాల్లో పాగా వేయాలన్న లక్ష్యంతో ముందుగా భువనగిరి, నకిరేకల్, దేవరకొండలలో కేసీఆర్ సభలకు టీఆర్‌ఎస్ ప్రణాళికలు వేసింది. ఆ వెంటనే ఈనెల 23న సూర్యాపేట, తుంగతుర్తిలలో కేసీఆర్ ప్రజాశీర్వాద సభలకు హాజరవుతున్నారు. తదుపరి కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్, పద్మావతి, కోమటిరెడ్డి సోదరులు పోటీలో ఉన్న నాగార్జున సాగర్, హుజూర్‌నగర్, కోదాడ, నల్లగొండలతో పాటు మిర్యాలగూడల్లో కేసీఆర్ ప్రజాశీర్వాద సభలు నిర్వహణకు టీఆర్‌ఎస్ సన్నాహాలు చేస్తోంది.