నల్గొండ

61 నామినేషన్ల తిరస్కరణ !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, నవంబర్ 20: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పనె్నండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 317 మంది అభ్యర్థుల నామినేషన్లకుగాను 61 మంది అభ్యర్థుల నామినేషన్లు మంగళవారం నాటి పరిశీలనలో తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 256 మంది అభ్యర్థుల నామినేషన్లకు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. నామినేషన్ల ఉపసంహరణకు రేపటి వరకు గడువు ఉండగా, పలు నియోజవర్గాల్లో ఒకే పార్టీ నుండి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణకు వారితో పార్టీలు బుజ్జగింపుల పర్వానికి తెరలేపాయి.
నల్లగొండ నియోజకవర్గంలో 26 మంది అభ్యర్థుల నామినేషన్లలో ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. సూర్యాపేట నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులకుగాను ఒకరి నామినేషన్ తిరస్కరించబడింది. కోదాడ నియోజకవర్గంలో 27 మంది నామినేషన్లకుగాను ఐదుగురి, మిర్యాలగూడలో ఇద్దరి నామినేషన్ల తిరస్కరించబడగా 43 మంది నామినేషన్లు ఆమోదించారు. ఆలేరులో 28 మంది నామినేషన్లకుగాను 12 మంది నామినేషన్లు తిరస్కరించారు. భువనగిరిలో 19 మంది నామినేషన్లు వేయగా నలుగురి నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. తుంగతుర్తిలో 27 మంది నామినేషన్లకుగాను ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నకిరేకల్‌లో 21 మందికి ఒక నామినేషన్ తిరస్కరించబడగా, నాగార్జున సాగర్‌లో 17 మంది అభ్యర్థుల నామినేషన్లకుగాను ఒక నామినేషన్ తిరస్కరించబడగా, కంకణాల శ్రీ్ధర్‌రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. మునుగోడు నియోజవర్గంలో 33 నామినేషన్లకుగాను 11 నామినేషన్లు తిరస్కరించారు. దేవరకొండ నియోజకవర్గంలో 26 మంది నామినేషన్లు వేయగా వారిలో ఆరుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. హుజూర్‌నగర్‌లో 25 మంది నామినేషన్లకుగాను తొమ్మిది మంది నామినేషన్లు తిరస్కరించారు.

మాయా కూటమి మాయలో పడొద్దు
కేసీఆర్ సభను జయప్రదం చేయండి
* ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు
చిట్యాల, నవంబర్ 20: అధికారం కోసం ఆరాటపడుతున్న మహా కూటమి మాయలో పడొద్దని ఆగ్రోస్ చైర్మన్, నకిరేకల్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి లింగంపల్లి కిషన్‌రావు సూచించారు. సంక్షేమ పథకాలు వంద శాతం పూర్తి కావాలంటే కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రిగా కొనసాగాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. పట్టణంలో ఆయన మంగళవారం స్థానిక టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. మహాకూటమి పేరుతో మాయా కూటమిగా ఏర్పడి ప్రజలను మాయ చేస్తూ మాట్లాడుతున్నారని, ప్రజలు వారి మాయలో పడొద్దని సూచించారు. ప్రతి పైసా ఉమయోగంలోకి తీసుకువచ్చే విధంగా కేసీఆర్ పరిపాలన కొనసాగించారని, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన వారికి విమర్శించే హక్కు లేదని, వారి తీరు చూస్తుంటే దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో ఎంత అభివృద్ది జరిగిందనే విషయాన్ని లెక్కలతో సహ చర్చకు సిద్ధంగా ఉన్నామని నియోజకవర్గ ఇన్‌చార్జిగా తాను చేస్తున్న ఈ సవాల్‌ను కోమటిరెడ్డి బ్రదర్స్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఈనెల 21న నకిరేకల్‌లో జరిగే కేసీఆర్ ప్రజా అశీర్వాద సభను లక్ష మంది ప్రజలు తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇంత వరకు ఏమి చేశాం, ఇంకా ఏమి చేస్తాం అనే విషయాలను ప్రజలకు తెలియపరుస్తారని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా సభలో పాల్గొనాలని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జడ్పీటీసీ శేపూరి రవీందర్, మార్కెట్ చైర్మన్ కాటం వెంకటేశం, రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ గంట్ల దయాకర్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పల్లపు బుద్దుడు, పట్టణ అధ్యక్షులు బెల్లి సత్తయ్య, ఎంపీటీసీ రెముడాల మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.