నల్గొండ

ప్రగతి భవన్, ఫాంహౌస్‌లకే కేసీఆర్ పాలన పరిమితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ రూరల్, నవంబర్ 20: ప్రగతి భవన్, ఫాంహౌస్‌లకే కేసీఆర్ పాలన పరిమితమైందని, కాంగ్రెస్‌ను గెలిపించాలన్న కసి ప్రజల్లో పెరిగిందని, త్వరలో మంచి రోజులు రాబోతున్నాయని పీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండలోని 4, 5 వార్డుల్లో ఆయన సతీమణి సబితారెడ్డితో కలిసి యాటకన్నారెడ్డి కాలనీ, హనుమాన్ నగర్, రవీంద్ర నగర్, బీట్ మార్కెట్, రామగిరి తదితర ప్రాంతాలలో గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు కాళేశ్వరం, సిరిసిల్ల, జగిత్యాల మీద దృష్టి తప్ప ఏ ప్రాంతాల గురించి పట్టించుకోలేదన్నారు. కేటీఆర్ మున్సిపాల్టీలకు నిధులు విడుదల చేయడంలో విఫలం చెందాడన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా ప్రజల బతుకుల్లో మార్పు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలం చెంది నేడు మరోమారు ధన బలంతో, మాటల గారడీతో గద్దెనెక్కాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో ప్రజలు విసుగు చెందారని కాంగ్రెస్‌ను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తామన్నారు. గత 20 ఏండ్లలో నల్లగొండ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసినా టీఆర్‌ఎస్ నాయకులు ఏం చేయలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గడ్డం రుద్రమాదేవి, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ, రాష్ట్ర నాయకులు వంగాల స్వామి గౌడ్, జడ్పీటీసీ రాధ, గుమ్ముల మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు కవిత, నర్సమ్మ, ధనలక్ష్మీ, శ్రీనివాస్ రెడ్డి, నాగమణి, అల్లె సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల ప్రచార పర్వంలో సతీమణులు..!
* భర్తల గెలుపు కోసం గడప గడపకు ప్రచారం
నల్లగొండ, నవంబర్ 20: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల పోరులో తలపడుతున్న అభ్యర్థుల గెలుపు కోసం వారి సతీమణులు శ్రమిస్తున్న తీరు ఓటర్లను ఆకట్టుకుంటుంది. జనాభాలో సగమైన మహిళా మణులకు ప్రధాన పార్టీలు పెద్దగా టికెట్లు ఇవ్వలేదు. అంతమాత్రాన ఎన్నికల పోరులో మహిళల భూమిక నామమాత్రం కాలేదు. పోటీలో ఉన్న తమ భర్తల గెలుపు కోసం భార్యలు తమ గడప దాటి ప్రతి ఓటర్ గడప గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తూ ఎన్నికల ప్రచార పర్వంలో తమదైన ముద్ర వేస్తున్నారు. మంగళవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ అసెంబ్లీ నియోజవర్గం పరిధిలో నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఐదోసారి పోటీలో ఉన్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సతీమణి మంగళవారం నల్లగొండ మున్సిపాల్టీలోని వివిధ వార్డుల్లో రోజంతా అలుపెరుగకుండా భర్తతో కలిసి కొన్ని వార్డుల్లో, ప్రత్యేకంగా మరికొన్ని వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తన భర్తను గెలిపించాలని అభ్యర్థించి మహిళలకు బొట్టుపెట్టి అభ్యర్థించారు.
ఇదే రీతిలో సూర్యాపేట జిల్లా కేంద్రం మున్సిపాల్టీలో మంగళవారం మంత్రి జగదీశ్‌రెడ్డి గెలుపు కోసం ఆయన సతీమణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సతీమణి, కుమార్తెలు, టీఆర్‌ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి సతీమణి, నకిరేకల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం సతీమణి, నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డి సతీమణి సైతం తమ భర్తల గెలుపు సాధనకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తు భర్త ఎన్నికల్లో కష్టంలో తాము సైతం సగమంటు తమ విశిష్టతను చాటుకుంటు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.