నల్గొండ

తెలంగాణను అమరావతికి బానిస కానివ్వకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిరేకల్, నవంబర్ 21: కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అమరావతికి (చంద్రబాబుకు) బానిస కానివ్వకుండా కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందని, కూటమిని కూలకొట్టి టిఆర్‌ఎస్‌ను గెలిపించుకుని అభివృద్ధిదిశలో తెలంగాణ పయణించేందుకు ప్రజలు కారు గుర్తుకు ఓటువేయాలని ఆపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి వేముల వీరేశం విజయం కోసం నకిరేకల్ మినిస్టేడియంలో బుధవారం సాయంత్రం జరిగిన ప్రజాఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి ప్రమాదం చంద్రబాబు రూపంలో పొంచి ఉందని, వందలమంది ఆత్మ బలిదానాలతో సాధించుకున్న తెలంగాణకు చంద్రబాబు పెత్తనం అవసరమా అని సభలోని ప్రజలను కేసీఆర్ అడిగారు. తనను ఎదుర్కోలేని కాంగ్రెస్ దద్ధమ్మలు తెలంగాణను అడుగడుగున అడ్డుకున్న వ్యతిరేకి చంద్రబాబుతో చేతులు కలిపి తెలంగాణకు చంద్రబాబు మోసుకువచ్చింది కాంగ్రెస్ నల్లగొండ జిల్లా నాయకులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో ముందున్న నకిరేకల్ నియోజకవర్గం చంద్రబాబు ప్రమాదం నుంచి కాపాడే బాధ్యతలోను ముందుండాలని కోరారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలలో దేశంలో లేని అనేక సంక్షేమ పథకాలను ఏర్పాటుచేసి అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి దిశలో నడిచేందుకు కృషి చేసిందన్నారు. రైతుబంధు, రైతుభీమా పథకాల ద్వారా ప్రపంచంలోనే గుర్తింపు లభించిందని ఏ దేశంలోనే ఇలాంటి పథకాలు లేవని రైతుల బాగుకోసం తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అవినీతికి దూరంగా ఉంటు కడుపు నోరుకట్టుకుని కుంభకోణాలు లేకుండా రాష్ట్ర సంపదను పెంచి ఆ సంపదను ప్రజలకు పంచినట్లు ఆయన తెలిపారు. పెంచిన సంపద ద్వారానే కళ్యాణ లక్ష్మి, సన్నబియ్యం, రైతుబంధు లాంటి పథకాలు అందివ్వగలిగామన్నారు. ఈ ఎన్నికలలో టిఆర్‌ఎస్ గెలుపొందితే రానున్న తెలంగాణ ప్రభుత్వం సంపదను మరింత బలోపేతంచేసి ఆసరా పథకాన్ని రూ.2016కు, వికలాంగులకు రూ.3016, నిరుద్యోగ భృతి నెలకు రూ.3వేలు, రైతుబంధు కింద రూ.10వేలు అందిస్తామని కేసీఆర్ అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో అయిటిపాముల, బ్రాహ్మణ వెల్లెంల, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మూడు షిఫ్టులలో ఇంజనీర్లు పనిచేస్తున్నారని, ప్రాజెక్టు పూర్తయితే కోటి ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. నియోజకవర్గంలో మూసీని మరింత అభివృద్ధికి ఆనకట్టలు కట్టి నియోజకవర్గానికి నీరు అందిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ విప్లవాన్ని తెచ్చి రైతులను ధనవంతులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణా రాష్ట్రంలో గుండాగిరి, మతకల్లోలాలు, గుడుంబా లేకుండా లేకుండా శాస్ర్తియత పరిపాలన అందించామని అన్నారు. నకిరేకల్ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్ధి వీరేశం ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి అని, పట్టుదల, శ్రమించేతత్వం కలిగిన ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధిచేస్తారని కేసీఆర్ అన్నారు. మూసీ ప్రాజెక్టు అభివృద్ధికి, అయిటిపాముల లిఫ్ట్‌కు, కట్టంగూర్ మండలాలలకు నీరు అందించేందుకు ఎమ్మెల్యే వీరేశం రూ.111 కోట్లు మంజూరు చేయించుకున్నాడని తెలిపారు. డిగ్రీ కళాశాల భవనం, నకిరేకల్, చిట్యాల మున్సిపాలిటీలకు నిధుల మంజూరు చేయాలని వీరేశం కోరాడని, నియోజకవర్గాన్ని ఆదుకుంటామని నకిరేకల్ ప్రజలు చైతన్యం ప్రదర్శించి లక్ష మెజారిటీతో వీరేశాన్ని గెలిపించాలని నియోజకవర్గ ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. వీరేశంను గెలిపిస్తే రానున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో వీరేశంకు పెద్ద పదవి లభిస్తుందని కేసీఆర్ అన్నారు. నూతన రాష్ట్రంలో మళ్లీ టిఆర్‌ఎస్ ఏర్పడిన తరువాత కంటి వెలుగుతో పాటు ముక్కు, చెవి, గొంతు చికిత్సలు ఉచితంగా చేయించడం, రక్తపరీక్షలు సహితం చేయించి తెలంగాణ ప్రజల ఆరోగ్య స్టేటస్‌ను ఒక రిజిస్టర్‌లో పొందుపరుస్తూ ప్రతి వ్యక్తి హెల్త్ ఫ్రొఫైల్ ఏర్పాటుచేసి భారతదేశంలోనే మార్గదర్శకంగా నిలుస్తామని కేసీఆర్ ప్రజలకు తెలిపారు. టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి వేముల వీరేశం ఆధ్వర్యంలో జరిగిన ఈసభలో టిఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేశవరావు, ఎంపిలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పూజర్ల శంభయ్య, కటికం సత్తయ్యగౌడ్, జెల్ల మార్కెండేయులు, స్థానిక నాయకులు పల్‌రెడ్డి నర్సిహ్మరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, సోమా యాదగిరి, మారం బిక్షంరెడ్డి, పెండెం ధనలక్ష్మి, కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సాగర్ తండాలలో జానారెడ్డికి చేదు అనుభవం
నాగార్జునసాగర్, నవంబర్ 21: నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని సాగర్ పక్కన ఉన్న గిరిజన తండాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మాజీ సిఎల్పి నేత కుందూరు జానారెడ్డికి ఆయన అనుచరులకు బుధవారం చేదు అనుభవం ఎదురైంది. ఒక దశలో గొడవకు దిగిన గిరిజనులతో అసహనానికి లోనైనా జానారెడ్డి కాంగ్రేస్ వ్యతిరేకులు ఏవరైనా తమ మీటింగ్‌లో ఉండవద్దని వెళ్లిపోవాలని కోపంతో హెచ్చరించారు. బుధవారం సాగర్ చుట్టుపక్కల ఉన్న నాగార్జునపేటతండా, తమ్మనకోటతండాలో ఎన్నికల ప్రచారానికై బయలుదేరారు. ఈ రెండు తండాలలో గిరిజనులలో ఒక వర్గం తండాలో జానారెడ్డి ప్రచారాన్ని అడ్డుకోని తండాలను అభివృద్ధి చేసింది ఏం ఉన్నదని ఓటు వేయమని ఎట్ల అడుగుతావని ప్రశ్నించారు. కాంగ్రేస్ ప్రచార వాహనాన్ని కూడ అడ్డుకోవడంతో అక్కడ ఉన్న గిరిజనులలోని కాంగ్రేస్ పార్టీ, ఇతర పార్టీల వర్గాల మధ్యన గందరగోళం నెలకొంది. కొంతమంది గిరిజనులు గిరిజన తండాల పక్కనుండే కృష్ణ పారుతున్న త్రాగడానికి నీళ్లు లేవని తండాల గురించి జానారెడ్డి పట్టించుకుంది ఏమి లేదని ఎదురుతిరిగారు. దీంతో అసహనానికి గురైనా జానారెడ్డి కాంగ్రేస్ పార్టీకి వ్యతిరేఖంగా ఉన్నవారు తాను చేసే మీటింగ్‌లో ఉండవద్దని అక్కడి నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. జానారెడ్డిపై నమ్మకం ఉంటే కాంగ్రేస్‌కు ఓటు వేయాలని, నమ్మకం ఉన్నవారితోనే ఉండాలని అన్నారు. గిరిజన తండాలలో రోడ్లు, త్రాగునీరు, కరెంట్, సాగునీరు సౌకర్యాలను కల్పించింది జానారెడ్డే అని గిరిజనులు మర్చిపోవద్దన్నారు. గిరిజనుల సమస్యలు ఏమైనా ఉంటే పోరాడి సాధించుకోవాలని ఇలా గడబిడి చేసి గందరగోళం సృష్టిస్తే బయపడేవాడిని కాదన్నారు. మీకు ఏవరు సేవా చేశారు అనుకుంటే మీకు ఏవరు మంచిగా అనిపిస్తే వారికే ఓటు వేయండి అని గిరిజనులతో అన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏ పార్టీ పాటుపడితే ఆ పార్టీకే ఓటు వేయాలని కోరారు. తండాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి, అన్ని వసతులు ఏర్పాటు చేస్తే ఏం చేయలేదనడం విడ్డురమన్నారు. ఆయనతో పాటు జెడ్పి వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి, సినీయర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, భగవాన్‌నాయక్, శంకర్‌నాయక్‌లు ఉన్నారు.