నల్గొండ

సాగునీటితో సస్యశ్యామలం: సీఎం కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, నవంబర్ 21: నల్లగొండ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులంతా అం దంగా లేరు, ఆరడుగుల అందగాన్ని గాను ఒక్కో కాంగ్రెస్ నాయకుడి శరీరాకృతిలో రెండో వంతు కూడా ఉండను.. అయినా నా కు తెలంగాణ గడ్డను సాగునీటితో సస్యశ్యామలం చేయాలన్న కంకణం కట్టుకొని పని చేస్తున్నానని ఆపద్దర్మ సీఎం కేసీఆర్ అ న్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భా గంగా దేవరకొండ పట్టణంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ జిలా లకు సాగునీరు అందించే యత్నంలో భాగంగా ఎస్సెల్బీసి టనె్నల్ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. సొరంగం పనులు తవ్వే టనె్నల్ మిషన్ లోపలికి వెలుతుందే కాని బయటకు రాదని ఈ చివరి నుండి ఆ చివరి వరకు పనులు పూర్తయితేనే మిషన్ బయటకు వస్తుందని ఈ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ఎస్సెల్బీసీ సొరంగం పనులను జిల్లా మంత్రిగా పని చేసిన జానారెడ్డి ఎలా అంగీకరించాడని కేసీ ఆర్ ప్రశ్నించారు. టీ ఆర్ ఎస్ పార్టీ తిరిగి అధికారం లోకి వచ్చిన వెంటనే దేవరకొండ నియోజకవర్గం లో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినా కోర్టుకు వెళ్ళి అవాంతరాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని కేసీ ఆర్ ఆరోపించారు. అప్పటి సమైఖ్య పాలకులు నాగార్జునసాగర్‌ను కట్టాల్సిన ప్రాంతంలో కట్టకుండా వేరే దగ్గర కట్టారని దీని వల్ల తెలంగాణ ప్రజలను తీరని అన్యాయం చేకూర్చారని ఆయన ఆరోపించారు. పొగిళ్ళ లిఫ్ట్ పనులను మంజూరు చేసి చందంపేట, నేరుడుగొమ్ము మండలాల బీడు భూములకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్‌లు కల్పిస్తానని గతంతో తాను ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నానని కేసీ ఆర్ స్పష్టం చేశారు. మైనార్టీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని ప్రధానమంత్రి మోడీకి ఇప్పటికే 20 సార్లు స్వయంగా కలిసి విన్నవించానని, 50 కి పైగా ఉత్తరాలు రాశానని చెప్పారు. అయినా మోడీ ఏ మాత్రం చలించకుండా తాత్సారం చేస్తున్నాడని కేసీ ఆర్ విమర్శించారు. టీ ఆర్ ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కేంద్రం మెడలు వంచైనా సరే రిజర్వేషన్‌లను సాధిస్తామని కేసీ ఆర్ అన్నారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల పై శాసనసభలో చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు పారిపోయారని ఆయన ఎద్దేవ చేశారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు లేని ప్రభుత్వం కోసం తీవ్రంగా శ్రమిస్తానని చెప్పారు. ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో తాను చురుకుగా పాల్గొంటానని కేసీ ఆర్ స్పష్టం చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత వితంతు, వికలాంగులు, వృద్దాప్య పెన్షన్‌లను పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. దేవరకొండలో జరిగిన బహిరంగ సభకు 60 వేలకు పైగా జనం హాజరయ్యారని ఈ జనాన్ని చూస్తుంటే దేవరకొండ నుండి రవీంద్రకుమార్ అత్యంత మెజార్టీతో గెలుస్తాడని కేసీ ఆర్ జోస్యం చెప్పారు. ఈ సభలో మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, టీ ఆర్ ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మెన్ కే కేశవరావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి రవీంద్రకుమార్, జడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ్మ, మదర్ డైరీ చైర్మెన్ గుత్తా జితేందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మెన్ వడ్త్య దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
జెండా పట్టుకు తిరిగిన రాంబాబుకు తప్పక న్యాయం చేస్తా : సీ ఎం కేసీ ఆర్
టీ ఆర్ ఎస్ పార్టీని స్ధాపించిన సమయంలో దేవరకొండ ప్రాంతంలో జెండా పట్టుకొని ఉన్న కొద్ది మందితో ఉద్యమం చేసిన రాంబాబునాయక్ కు తప్పక న్యాయం చేస్తానని సీ ఎం కేసీ ఆర్ ప్రజా ఆశీర్వాద సభలో వేలాది మంది జనం సమక్షంలో హామీ ఇచ్చారు. రాంబాబుకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని అభిప్రాయపడ్డారు. రాంబాబునాయక్ పేరును గుర్తుంచుకొని సీ ఎం కేసీ ఆర్ స్వయంగా సభలో రాంబాబునాయక్‌కు న్యాయం చేస్తానని చెప్పడంతో సభలో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.