నల్గొండ

హుజూర్‌నగర్‌లో కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 11: టీపీసీసీ చీఫ్, మహా కూటమి రథసారధి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా పరిధిలోని హుజూర్‌నగర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడవసారి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నాటి నుంచి ఈ స్థానం నుండి బరిలో నిలుస్తున్న ఆయన వరసగా విజయాలు సాధిస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఈ స్థానంలో మొత్తం 1,75,259 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఉత్తమ్ 92,996 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్ధి టీఆర్‌ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డిపై 7,466 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. సైదిరెడ్డికి 85,530 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మొదటి రౌండ్ నుంచి ఉత్తమ్ ఆధిక్యతను కనబరుస్తూ వచ్చారు. మొత్తం 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగగా మూడు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండుల్లో ఉత్తమ్ ముందంజలో దూసుకపోయారు. పీసీసీ చీఫ్‌గా ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సారధ్యంలోని మహాకూటమి గెలుపు బాధ్యతను సవాల్‌గా స్వీకరించి రాష్టవ్య్రాప్తంగా పర్యటించిన ఉత్తమ్ ఒకటి, రెండుసార్లే ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రచార బాధ్యతలను స్థానిక నేతలకు అప్పగించారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి స్థానికంగా ఉంటూ ముమ్మర ప్రచారం చేయడంతో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఉత్తమ్‌కు గట్టిపోటీ ఇచ్చి మెజార్టీ తగ్గించేలా పనిచేశారు. 2014 ఎన్నికల్లో ఉత్తమ్‌కు 23,924 ఓట్ల మెజార్టీ రాగా ఈసారి 7,466తోనే గెలుపొందారు. కాగా ఈ నియోజకవర్గం నుంచి మూడుసార్లు గెలుపొందిన ఆయన ప్రతి ఎన్నికల్లోనూ టీ ఆర్ ఎస్ అభ్యర్థులపైనే విజయం సాధించడం విశేషం. 2009లో ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, 2014లో తెలంగాణ మలిదశ ఉద్యమ విద్యార్ధి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మపై గెలుపొందారు. 2009 ఎన్నికలకు ముందు కోదాడ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీచేసిన ఆయన రెండుసార్లు విజయం సాధించగా ఇది మూడోవిజయం.