నల్గొండ

మునుగోడు గడ్డపై కాంగ్రెస్ విజయకేతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మునుగోడు, డిసెంబర్ 11: మనుగోడు నియెజకవర్గ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మినహా 22,121మెజార్టీతో గెలుపొందాడు. గత 2014 ఎన్నికల్లో 38వేల భారీ మెజార్టీ సాధించిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నాలుగున్న సంవత్సరాల పాలనలో విసిగిపోయి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. బీజేపీ అభ్యర్థికి ఈ ఎన్నికల్లో 12,558 ఓట్లు రాగా గత ఎన్నికలలో కంటే సగం ఓట్లు తగ్గిపోయాయి. మంగళవారం ఎన్నికల ఫలితాల ప్రకారం మొత్తం 20రౌండ్లలో ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యత సాధించడం గమనార్హం. మొదటి రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 3702 ఓట్లు, కాంగ్రెస్‌కు 4717 ఓట్లు, మూడవ రౌండ్‌లో టీఆర్‌యస్ 11,216 ఓట్లు, కాంగ్రెస్‌కు 12,389 ఓట్లు, నాలుగో రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 16,034, కాంగ్రెస్‌కు 17,783 ఓట్లు, ఐదవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 20,319, కాంగ్రెస్‌కు 23,089 ఓట్లు, ఆరవ రౌండ్‌లోటీఆర్‌యస్‌కు 24,112, కాంగ్రెస్‌కు 27,824 ఓట్లు, ఏడవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 28,228, కాంగ్రెస్‌కు 32,892 ఓట్లు, ఎనిమిదవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 31,172, కాంగ్రెస్‌కు 37,566 ఓట్లు, తొమ్మిదవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 34,941, కాంగ్రెస్‌కు 43,594 ఓట్లు, పదవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 38,990, కాంగ్రెస్‌కు 49,693 ఓట్లు, పదకొండవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 42,417, కాంగ్రెస్‌కు 49,693 ఓట్లు, పనె్నండవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 45,788, కాంగ్రెస్‌కు 54,213 ఓట్లు, పదమూడవ రౌండ్‌లోటీఆర్‌యస్‌కు 49,295, కాంగ్రెస్‌కు 59,952 ఓట్లు, పద్నాలుగవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 53,905, కాంగ్రెస్‌కు 64,745 ఓట్లు, పదిహేనవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 58,308, కాంగ్రెస్‌కు 76,110 ఓట్లు, పదహారవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 61,782, కాంగ్రెస్‌కు 81,537 ఓట్లు, పద్దెనమిదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్‌కు 69,101, కాంగ్రెస్‌కు 90,601 ఓట్లు, పందొమ్మిదవ రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 72,845, కాంగ్రెస్‌కు 94,741 ఓట్లు, ఇరయ్యో రౌండ్‌లో టీఆర్‌యస్‌కు 73,887, కాంగ్రెస్‌కు 96,008 ఓట్లు సాధించారు. ప్రతి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి వెయ్యి ఓట్ల మెజార్టీతో దూసుకెళ్తున్నాడు. టీఆర్‌యస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డితో 22,121 ఆధిక్యంతో గెలుపొందారు.