నల్గొండ

పేట మార్కెట్‌కు పోటెత్తిన ధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 13: తెలంగాణలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ యార్డుగా పేరొందిన జిల్లా కేంద్రంలోని మార్కెట్‌కు గురువారం భారీగా ధాన్యం తరలివచ్చింది. శాసనసభ ఎన్నికల నేపధ్యంలో వ్యవసాయ మార్కెట్ యార్డులో స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడంతో ఈనెల 5వ తేదీ నుంచి వరుసుగా సెలవులు ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తొమ్మిది రోజుల సెలవుల అనంతరం గురువారం కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులు ఒక్కసారిగా తరలిరావడంతో ధాన్యం పోటెత్తింది. యార్డు మొత్తం ధాన్యం రాశులతో నిండిపోయింది. ఇన్ని రోజులుగా పోలీసులు, అధికారులు, ఎన్నికల సిబ్బందితో హడావుడిగా ఉన్న మార్కెట్ నేడు రైతులు, హమాలీలు, దడువాయిలతో దర్శనమిచ్చింది. గత వారం రోజులుగా యార్డులో అధికారుల కార్లు, ఇతర వాహనాలు కనిపించగా నేడు రైతులు ధాన్యం తరలించేందుకు తీసుకవచ్చిన ట్రాక్టర్లే అధికంగా ఉన్నాయి. ఈరోజు మార్కెట్‌కు సుమారు 40వేల బస్తాల ధాన్యం రాగా అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేశారు. హెచ్‌ఎంటీ 3 రకం ధాన్యం 3వేల బస్తాలు, ఆర్‌ఎన్‌ఆర్ 2వేల బస్తాలు, బీపీటీ 28వేలు, ఐఆర్ 6వేలు, ఎంటీయూ రకం వెయ్యి బస్తాల ధాన్యం మార్కెట్‌కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈసారైనా కర్నెకు మంత్రి పదవి దక్కేనా..?
సంస్థాన్‌నారాయణపురం, డిసెంబర్ 13: మండల కేంద్రానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు ఈ దఫా మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట అచెంచల విశ్వాసంతో తెలంగాణ ఉద్యమంలో ముందుంటూ వచ్చారు. కేసీఆర్ ఏ పని చెప్పినా దాన్ని విజయవంతంగా పూర్తిచేయగలడనే పేరు తెచ్చుకున్నారు. పార్టీ విధానాలను, ప్రభుత్వ పనితనాన్ని, ప్రతి పక్షపార్టీల విమర్శలను సమర్థవంతంగా సభలలో, పత్రికాముఖంగా, టీవీ చర్చల్లో ప్రజలకు వివరించడంలో దిట్టగా కర్నె ప్రభాకర్ పేరు గడించారు. 2014 ఎన్నికల్లో మునుగోడు టిక్కెట్ ఆశించినా ఫలితం దక్కలేదు. తదనంతరం ఎమ్మెల్సీ పదవిని అప్పగించిన కేసీఆర్ ప్రభుత్వంలో భాగస్వామిని చేశారు. 2018 ఎన్నికల్లో రాష్టవ్య్రాప్తంగా సిట్టింగ్‌లకే టిక్కెట్లు కేటాయించారు. కాని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కర్నె ప్రభాకర్‌కు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహాయ్యను గెలిపించే బాధ్యతను భుజస్కంధాలపై పెట్టారు. కేసీఆర్ ఏ పనిచెప్పినా విజయవంతంగా పూర్తిచేసే కర్నె ప్రభాకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిపైన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నర్సింహాయ్యను గెలిపించడంలో కీలక భూమిక పోషించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్‌రెడ్డికి కేసీఆర్ మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. మరి ఈసారి బీసీలకు మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈసారి మునుగోడు నుంచి పోటీ చేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైనారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడినా మునుగోడులో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నీరశించిపోయారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రజల్లో ఉన్నా, ఎమ్మెల్యే లేని లోటును భర్తీ చేయడానికి ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో కేసీఆర్‌కు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు వెన్నంటి ఉంటున్న కర్నె ప్రభాకర్‌కు మంత్రి పదవి వస్తుందని ఈప్రాంత అప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

సీఎంను కలిసిన ఎంపీ గుత్తా, ఎమ్మెల్యే కంచర్ల
నల్లగొండ రూరల్, డిసెంబర్ 13: ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం కేసీఆర్‌ను గురువారం నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మంత్రి జగదీశ్‌రెడ్డితో, తన సోదరుడు కంచర్ల కృష్ణారెడ్డితో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి సైతం సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.
ఏక శిఖరవాసునికి నిత్య కల్యాణం
యాదగిరిగుట్ట, డిసెంబర్ 13: శ్రీ యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంలో గురువారం నిత్యారాధనలు భక్తుల అర్జిత సేవలు సంప్రదాయంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి హారతి నివేదన చేశారు. బిందె తీర్థం స్వామివారికి బాలభోగంతో ఆలయ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా ప్రతిష్ఠామూర్తులను ఆరాధించిన పూజారులు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పంచామృతాలతో అభిషేకం జరిపి తులసీదళాలతో అర్చించారు. వివిధ రకాల సుగంధ పరిమళాల పూలమాలలతో పట్టు వస్త్రాలతో బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. కవచ మూర్తులను స్వర్ణ పుష్పాలతో కొలిచారు. ఆలయంలో కల్యాణ మండపం నందు అర్చకుల వేద పండితుల మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణోత్సవాన్ని పంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఘనంగా జరిపారు. స్వామి అమ్మవార్ల కల్యాణానికి ముందు ఆలయంలో విశ్వక్షేణ ఆరాధన పున్యహావచనం శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. అనంతరం అత్యంత సుందరంగా అలంకరించిన గజవాహనంపై స్వామి అమ్మవార్లను అధిష్ఠించి గజ సేవోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన అష్టోత్తరం, సహస్ర నామార్చనలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయంలో శ్రీ స్వామి అమ్మవార్ల వెండిజోడి సేవోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.