నల్గొండ

నేటి నుండి సర్పంచ్‌ల పాలన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 1: పంచాయతీల ఎన్నికల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు నేటి నుండి గ్రామ పరిపాలన బాధ్యతలు స్వీకరించనుండటంతో పంచాయతీల్లో నూతన సర్పంచ్‌ల పాలన ప్రారంభంకానుంది. నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవీ ప్రమాణా స్వీకార కార్యక్రమాలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. పంచాయతీ భవనాలకు సున్నాలు, రంగులు వేసి, పచ్చని మామిడి తోరణాలు, పూల తోరణాలతో ముస్తాబు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1720 పంచాయతీలకుగాను ఎన్నికలు జరిగిన 1713 సర్పంచ్ స్థానాల్లో నేడు నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు పదవీ ప్రమాణాస్వీకారం చేయనున్నారు. ఈ దఫా ప్రభుత్వం కొత్తగా 590 తండాలను, మధిర గ్రామాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించడంతో ఆ పంచాయతీల్లో తొలిసారిగా సర్పంచ్‌ల పాలన ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో ఆ గ్రామాల్లో పండుగ సందడి కనిపిస్తుంది. మొత్తం ఉమ్మడి జిల్లాలోని 1720 పంచాయతీల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కింద 862 స్థానాలు కేటాయించారు. వీరికి తోడు మరికొంత మంది జనరల్ స్థానాల్లో గెలిచారు. మొత్తంగా 50 శాతానికి పైగా పంచాయతీల్లో మహిళల పాలన సాగనుండటం విశేషం.

రిజర్వాయర్ పనులను అడ్డుకున్న రైతులు

* ఎకరానికి 20 లక్షలు, లేదా భూమికి భూమి ఇవ్వాలి
* లేదంటే ఆత్మహత్యలకు పాల్పడుతామని హెచ్చరిక
చింతపల్లి, ఫిబ్రవరి 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా మండల కేంద్రంలో నిర్మించనున్న 0.91టీఎంసీ రిజర్వాయర్ పనులను శుక్రవారం ఇంజనీరింగ్ అధికారులు సాగిస్తుండగా రైతులు యంత్రాలకు అడ్డుగా నిలిచి పనులను సాగనీయమని భీష్మించి కూర్చున్నారు. చింతపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులకు సంబంధించి నసర్లపల్లి సమీపంలో కట్ట పనులను చేయడానికి యంత్రాలను వినియోగిస్తుండగా రైతులను అడ్డుకున్నారు. తమకు భూమికి భూమి కాని లేదా ఎకరానికి 20లక్షల రూపాయల చెల్లిస్తేనే పనులను సాగనిస్తామని రైతు ప్రతినిధి ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతులు హెచ్చరించారు. తాము ఆత్మహత్యలకైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు. రిజర్వాయర్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని కాని తమకు ఎకరానికి 20లక్షలు చెల్లించాలని సంఘటన స్థలంలో ఉన్న డీఈ శైలజ, ఏఈలు రవీందర్, అభిషేక్‌లతో వాగ్వాదానికి దిగారు. చేసేదిలేక అధికారులు తమ యంత్రాలతో తిరుగుముఖం పట్టారు. భూమి విక్రయించిన రైతు స్థలంలో పనులు సాగించడానికి అడ్డు రాకూడదని అధికారులు చెప్పినా ఫలితం లేకపోయింది. రైతులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు.

రైతన్నకు కేంద్ర సర్కారు దన్ను

నల్లగొండ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం 2019-20 తాత్కాలిక బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం రైతాంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. పెరిగిన పంటల సాగు వ్యయంతో పెరిగిన పెట్టుబడులు, అప్పులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మద్ధతు ధర కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నష్టాలతో ఆర్థికంగా చితికిపోతున్న రైతాంగం ఆత్మహత్యల పాలవుతున్న నేపధ్యంలో కేంద్రం ప్రటించిన కిసాన్ సమ్మాన్ నిధి ఊరటగా కనిపిస్తుంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు పథకంతో పంటకు ఏటా 8వేలు పెట్టుబడి సహాయంగా అందిస్తుండగా దీనిని పది వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకటించారు. రైతుబంధు పథకాన్ని పోలివున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకంతో దేశంలోని ఐదు ఎకరాల లోపు భూమి వున్న చిన్న, సన్నకారు రైతులకు మూడు విడతలుగా ఏటా 6వేలు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని కేంద్రం ప్రకటించింది. 2018 డిసెంబర్ 1 నుండి 2019 మార్చి 31 త్రైమాసిక కాలానికి సంబంధించిన మొదటి విడత 2వేల రూపాయలను రైతులకు కేంద్రం ముందుగా అందించనుంది. కిసాన్ సమ్మాన్ నిధితో దేశ వ్యాప్తంగా 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారని కేంద్రం అంచనాగా ఉంది. తెలంగాణలో ఈ పథకం కింద ఐదు ఎకరాలలోపు రైతులు ప్రస్తుత ప్రణాళిక, గణంకశాఖల లెక్కల మేరకు 47లక్షల 67వేల 500మందికి లబ్ధి చేకూరనుంది. ఇందులో 2.5ఎకరాల లోపు రైతులు 34లక్షల 41,087మంది ఉండగా వారి పరిధిలో 39లక్షల 16,947ఎకరాల భూమి ఉంది. 2.5నుండి 5ఎకరాల లోపు ఉన్న రైతులు 13లక్షల 27వేల 362మంది ఉండగా వారి పరిధిలో 46లక్షల 73,380ఎకరాల భూమి ఉంది. తెలంగాణలో రైతుబంధు పథకం అమలులో కూడా ఇదే లెక్కలను పరిగణలోకి తీసుకుంటున్నారు. రైతుబంధు పథకం కింద తెలంగాణలో భూరికార్డులు సవ్యంగా ఉన్న 43లక్షల 84వేల మందికి 4,724కోట్లు అందించడం గమనార్హం.
కాగా, తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు కాకుండా 5ఎకరాలపైబడి 10 ఎకరాల వరకు ఉన్న రైతులు 6,02,925 మంది ఉండగా వారి పరిధిలో 39లక్షల 62వేల 837ఎకరాల భూమి ఉంది. 10నుండి 25 ఎకరాల భూమి ఉన్నవారు 1లక్ష 66,833 మంది ఉండగా వారి పరిధిలో 23లక్షల 16,900 ఎకరాల భూమి, 25ఎకరాల పైబడి భూమి ఉన్న వారు 15,775మంది ఉండగా వారి పరిధిలో 6లక్షల 21,997ఎకరాల భఊమి ఉంది. మొత్తం ప్రస్తుత లెక్కల మేరకు 55లక్షల 53,982 మంది రైతుల పరిధిలో కోటి 54లక్షల 92,060ఎకరాల భూమి ఉన్నట్లుగా రికార్డులు వెల్లడిస్తున్నాయి. ప్రతి ఐదేళ్లకొక పర్యాయం నూతనంగా కమతాల సర్వేను ప్రణాళిక గణంకశాఖ, వ్యవసాయ శాఖలు కొనసాగిస్తుండగా ప్రస్తుతం నూతన సర్వే పురోగతిలో ఉంది. నూతన సర్వే మేరకు చిన్న, సన్న కారు రైతుల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోవచ్చని అంఛనా వేస్తున్నారు. అదిగాక కేంద్ర, రాష్ట్రాలు రైతులకు నగదు బదిలీ పథకాలు ప్రవేశ పెడుతున్న నేపధ్యంలో కుటుంబ పెద్దపేరుతో ఐదు ఎకరాల కంటే అధికంగా ఉన్న భూమిని కుటుంబ సభ్యుల పేరిట పంపకాలు చేసే పరిస్థితి పెరిగే అవకాశం కనిపిస్తోంది.