నల్గొండ

భగభగా వడగాలులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మే 24: జిల్లాలో వడగాలుల తీవ్రత ధాటికి జనం తల్లడిల్లారు. ఉదయం 10 నుండే ఎండవేడిమితో పాటే తమ ప్రతాపం చూపడం మొదలెట్టిన వడగాలులు రాత్రి వేళ కూడా కొనసాగడంతో ప్రజలు ఇండ్లు వదలి బయటకు వెళ్లేందుకు జడిసిపోయారు.
అగ్ని కీలలను తలపించేలా వీస్తున్న వడగాలులకు బెంబెలెత్తిన ప్రజలు నివాసాలకే పరిమితమైపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, రోడ్లు జనం రద్దీ లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు ఉదయం, సాయంత్రం వేళలకే పనులకు పరిమితమయ్యారు. ఎండల తీవ్రత, వేడి వడగాలులతో వృద్ధులు, చిన్నారులు, రోజుకూలీలు, ఫుట్ పాత్ చిరు వ్యాపారులు నానా అవస్థలకు గురయ్యారు. వేడి తాపానికి జనం కూల్‌డ్రింక్స్, నిమ్మ, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, తాటి ముంజలను ఆశ్రయించడం కనిపించింది. జిల్లా కలెక్టరేట్‌కు వివిధ ప్రాంతాల నుండి పలు రకాల పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య వడగాలుల ధాటికి నామమాత్రంగా ఉండటంతో కార్యాలయాలు బోసిపోయాయి. అధికారులు సైతం క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్నారు. జిల్లా కేంద్రం నల్లగొండ నిప్పుల కొండను తలపించింది. 12గంటల నుండి 5గంటల వరకు రోడ్లన్ని జన సంచారం లేక కర్ఫ్యూను తలపించాయి.