నల్గొండ

మిర్యాలగూడ బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ, జూన్ 17: మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలి లేదంటే నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన మిర్యాలగూడ బంద్ ప్రశాంతంగా సంపూర్ణంగా జరిగింది. బంద్ సందర్భంగా పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, కళాశాలలు, బ్యాంక్‌లు మూసివేయగా మిర్యాలగూడ డిపోలో బస్సులు పాక్షికంగా నడిచాయి. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలను స్వచ్ఛందంగానే మూసివేశారు. అయితే కొంతమంది వ్యాపారులు షాపులను తీసేందుకు ప్రయత్నించగా అఖిలపక్ష నేతలు బంద్ చేయించారు. ఈసందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధిచెందుతున్న జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేసినట్లయితే మరింత అభివృద్ధి చెంది ఆదర్శ జిల్లాగా రాష్ట్రంలో నిలుస్తుందని వారు అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేయని పక్షంలో నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా ఎంతో అభివృద్ధిచెంది రైల్వేలైన్, స్టేట్ హైవే కలిగి ఉండి రవాణాకు ఎంతో అనుకూలంగా మిర్యాలగూడ పట్టణం ఉంటుందని అంతేకాకుండా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి పట్టణం నడిబొడ్డులో కలిగి ఉందని ఆయన అన్నారు. మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటుచేయలేకపోతే నల్లగొండలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిఎఓ కెసి.ప్రమీలకు వినతిపత్రాన్ని అందచేశారు. కార్యక్రమంలో వేనేపల్లి పాండురంగారావు, కాంగ్రెస్ నాయకులు , బిజెపి నాయకులు టిడిపి నాయకులు ఆర్‌ఎంపిల సంఘం నేత డాక్టర్ మునీర్, బిసి సంఘం నేతలు, ఆప్ నాయకుడు సరికొండ ఋషికేశ్వర్‌రాజు తదితరులు పాల్గొన్నారు. కాగా మిర్యాలగూడను జిల్లా కేంద్రంగా ఏర్పాటుచేయాలని లేదా నల్లగొండ జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ మిర్యాలగూడ పట్టణ బంద్‌లో భాగంగా న్యాయవాదులు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జి.రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి మట్టపల్లి శ్రీ్ధర్‌గౌడ్ పాల్గొన్నారు.