నల్గొండ

మైనార్టీ విద్యార్థుల సంక్షేమం కోసమే మైనార్టీ గురుకులాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూన్ 30: మైనార్టీ విద్యార్ధులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరాలన్న ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్ధుల కోసం మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి దేవరకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల పాఠశాలను ప్రారంభించారు. మైనార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి లోకి రావాలని సూచించారు. ఈ సంవత్సరమే మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేసినందున ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ బిల్డింగ్‌లలోనే పాఠశాలలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేవరకొండ పట్టణంలో వచ్చే విద్యాసంవత్సరం నాటికి 25 కోట్ల వ్యయంతో మైనార్టీ గురుకుల పాఠశాలను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లాలో ఐదు పట్టణాల్లో ఈ విద్యాసంవత్సరం మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో ప్రభుత్వం నూతనంగా మైనార్టీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న ఈ పాఠశాల వల్ల నియోజకవర్గం పరిధిలోని మైనార్టీ విద్యార్ధులకు క్రమశిక్షణతో కూడిన మంచి విద్య అందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నేనావత్ బాలూనాయక్, నగరపంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, ఆర్డీవో గంగాధర్, తహశీల్దార్ గణేశ్, టి ఆర్ ఎస్ నాయకులు పున్న వెంకటేశ్వర్లు, శిరందాసు కృష్ణయ్య, కౌన్సిలర్ చీదళ్ళ గోపి పాల్గొన్నారు.