నల్గొండ

భువనగిరి కేంద్రంగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 1: నల్లగొండ జిల్లా భువనగిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని భువనగిరి టౌన్, రూరల్, బీబీనగర్, పోచంపోల్లి, బొమ్మలరామారం, వలిగొండ, చౌటుప్పల్ టౌన్ పోలీస్ స్టేషన్లతో కూడిన సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనులు శుక్రవారం నుండి భువనగిరి కేంద్రంగా అధికారికంగా ప్రారంభమైనట్లుగా జిల్లా ఎస్పీ ఎన్. ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్లతో భువనగిరి కేంద్రంగా సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటిదాకా భువనగిరి డిఎస్పీ కార్యాలయం కొనసాగిన భవనంలో సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్ కార్యాలయం పనిచేస్తుందన్నారు. భువనగిరి డిఎస్పీ కార్యాలయాన్ని యాదగిరిగుట్టకు మార్చడం జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భువనగిరి సబ్ డివిజన్ పరిధిలో మిగిలిన 10పోలీస్ స్టేషన్లు యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట, ఆత్మకూర్(ఎం), గుండాల, మోత్కూర్, చిట్యాల, రామన్నపేట, సంస్థాన్ నారాయణపూర్ పోలీస్ స్టేషన్లతో కొత్తగా యాదగిరిగుట్ట పోలీస్ సబ్ డివిజన్‌గా ఏర్పాటవుతుందన్నారు. యాదగిరిగుట్ట సర్కిల్‌ను యధావిధిగా కొనసాగిస్తూ కొత్తగా చిట్యాల, మోత్కూర్‌లను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కేంద్రాలుగా ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వానికి నివేదిక అందించామని తెలిపారు. తదుపరి అధికారిక ఆదేశాలు వచ్చే వరకు ఆయా స్టేషన్ల సిబ్బంది యధాస్థానాల్లో విధుల్లో కొనసాగుతారని తెలిపారు. కొత్తగా ప్రతిపాదించిన చిట్యాల పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో రామన్నపేట, చిట్యాల, సంస్థాన్ నారాయణపూర్ స్టేషన్లు, మోత్కూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో మోత్కూర్, ఆత్మకూర్(ఎం), గుండాల పోలీస్ స్టేషన్లు ఉంటాయని ఎస్పీ వెల్లడించారు. ప్రస్తుత యాదగిరిగుట్ట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పరిధిలో యాదగిరిగుట్ట, ఆలేరు, తుర్కపల్లి, రాజాపేట పోలీస్ స్టేషన్లు కొనసాగుతాయన్నారు. యాదగిరిగుట్ట డిఎస్పీ కార్యాలయం గుట్ట కేంద్రంగా ఏర్పాటవుతుందన్నారు.