నల్గొండ

మంత్రి వాహనాన్ని అడ్డుకున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ టౌన్, జూలై 2: రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో గత పది సంవత్సరాల నుండి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పని లేదంటూ మార్చి నెల నుండి తొలగించినందునా వారంతా వారి కుటుంబాలతోపాటు రోడ్డున పడ్డారని, వారిని ఇతర శాఖలలో సర్దుబాటు చేసి కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ శనివారం జిల్లా పరిషత్ ఆవరణలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి తెలంగాణ రాష్ట్ర హౌజింగ్ కార్పోరేషన్ ఔట్ సోర్సింగ్ ఎంప్లయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వినతినందించారు. జిల్లా పరిషత్ నూతన భవన శంకుస్థాపనకు విచ్చేసిన మంత్రి వాహనాన్ని అడ్డుకొని తమ కుటుంబాలను ఆదుకోవాలని వినతిలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా 1179 మందిమి పని చేశామని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యోగ సంఘాల పిలుపునందుకుని స్వామి గౌడ్, దేవిప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని, 42రోజులు సకలజనుల సమ్మెలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించామన్నారు. తామందరం పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారమేనని, ప్రస్తుతం తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, తమను ఏదోరకంగా ఉద్యోగాలలో సర్దుబాటు చేయకపోతే ఆత్మహత్యలే శరణ్యంగా బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రామకృష్ణారెడ్డి, బోల్ల వెంకట్, ఇంద్రసేనారెడ్డి, కవిత, సుజాత, జ్యోతి, శ్రీనివాస్‌రెడ్డి, సోమాని, నాగార్జున, సురేష్, రమణ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

భార్గవ్ కుటుంబానికి 35 వేల ఆర్థిక సహాయం

యాదగిరిగుట్ట రూరల్, జూలై 2: ఇటీవల మరణించిన వైఎస్‌ఆర్‌సిపి యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు గుండు భార్గవ్‌రాజ్‌గౌడ్ కుటుంబానికి వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్లోజు వెంకటేష్ 35 వేల ఆర్ధిక సహయాన్ని శనివారం అందజేశారు. భార్గవరాజ్‌గౌడ్ సంతాపసభనుద్ధేశించి ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ అనేక కార్యక్రమాలను కార్యకర్తలను కలుపుకుంటూ పార్టీ అభివృద్దికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు వైఎస్‌ఆర్‌సిపి అండగా ఉంటుందని అన్నారు.పేద కుటుంబానికి చెందిన భార్గవ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. వైఎస్‌ఆర్‌పిసి జాతీయ అధ్యక్షుడు వై ఎస్ జగన్,రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి,జిల్లా అధ్యక్షుడు తుమ్మలపల్లి భాస్కర్‌కు భార్గవ్ మరణించిన విషయాన్ని వివరించామని పార్టీ పరంగా ఆదుకోవాలని అన్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బండ్రు అంజనేయులు,పల్లె ప్రకాష్‌గౌడ్,అచ్చిన శ్రీకాంత్,మొలుగు రాములు,సతీష్‌రాజ్,సిపిఐ జిల్లా మహిళా నాయకురాలు బండి జంగమ్మ,టిఆర్‌ఎస్ నాయకులు హేమేందర్ పాల్గొన్నారు.