నల్గొండ

డిండి లిఫ్ట్ పనులకు పది రోజుల్లో టెండర్లు : ఎంపి గుత్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 3: దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసే డిండి ఎత్తిపోతల పధకం పనులకు ప్రభుత్వం పది రోజుల్లో టెండర్‌లను ఆహ్వానించనుందని ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. ఆదివారం స్ధానిక జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ నివాసగృహంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పధకం పై శనివారం రోజు ముఖ్యమంత్రి కెసి ఆర్ నీటిపారుదల శాఖ అధికారులు, జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 2018 నాటికి ఎత్తిపోతల పధకం ప్రధాన పనులను పూర్తి చేసి చెరువుల్లోకి నీటిని తరలించాలన్న లక్ష్యం మేరకు ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం 10 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉండగా ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తుల నుండి 3500 ఎకరాలు, 1284 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించడం పూర్తయిందని సుఖేందర్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వార 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని ఆయన చెప్పారు. బస్వాపూర్ నుండి చిట్యాల వరకు 16 వ ప్యాకేజి ద్వార పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కెసి ఆర్ నిర్ణయించారని చెప్పారు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా కొండమల్లేపల్లి నుండి జడ్చర్ల వరకు ఉన్న 100 కిలోమీటర్ల రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను విడుదల చేసిందని గుత్తా తెలిపారు. కిలోమీటరుకు 5 కోట్ల రూపాయల చొప్పున 50 కిలోమీటర్లకు ఒక ప్యాకేజి లెక్కన వంద కిలోమీటర్లను రెండు ప్యాకేజీలుగా నిర్ణయించారని పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్‌లను అధికారులు త్వరలో ఆహ్వానించనున్నట్లు చెప్పారు. దేవరకొండ, కొండమల్లేపల్లి పట్టణాల్లో రోడ్డు మధ్య నుండి ఇరు వైపులా 50 మీటర్ల మేర రోడ్డు విస్తరణ ఉంటుందని గుత్తా చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో జడ్పీటీసి ఆలంపల్లి నర్సింహ్మ, నగరపంచాయతి వైస్‌చైర్మెన్ నల్లగాసు జాన్‌యాదవ్, వైస్ ఎంపిపి వేణూధర్‌రెడ్డి, కౌన్సిలర్లు చీదళ్ళ గోపి, వడ్త్య దేవేందర్‌నాయక్, నాయకులు శిరందాసు కృష్ణయ్య, లింగారెడ్డి, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు.