నల్గొండ

ఉద్యమకారులను విస్మరిస్తున్న ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలేరు, జూలై 3: తెలంగాణ ఉద్యమకారుల పోరాటాలు, త్యాగాలతో సిద్ధించిన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కెసిఆర్ నాయకత్వంలోని టిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ అమరులను, ఉద్యమకారులను విస్మరించి తెలంగాణ ద్రోహులకు అందలమెక్కిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు దుయ్యబట్టారు. ఆదివారం స్థానిక లక్ష్మీగార్డెన్‌లో తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల కుటుంబాలకు, ఉద్యమకారులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సభలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెడుతుందని ఆరోపించారు. సీఎం కెసిఆర్ కేవలం కొడుకు, కూతురు, అల్లుడితో కుటుంబ పాలన, నియంతృత్వ పాలన సాగిస్తున్నాడని విమర్శించారు. మంత్రి వర్గంలో ఇతర మంత్రులంతా బుగ్గకారుకే పరిమితమయ్యారన్నారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ పేరుతో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తూ ఫిరాయింపు చట్టాలను అపహాస్యం చేస్తున్నాడని విమర్శించారు. కెసిఆర్ గతంలో ఎంపిగా ఏనాడు కూడా పార్లమెంటులో ఉద్యమించలేదని, తాను ఎంపిగా ఉన్నప్పుడు వంద రోజుల పాటు పార్లమెంటును స్తంభింపచేశానని రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేశారు. మోత్కుపల్లి నరసింహులు మాట్లాడుతు సామాజిక తెలంగాణ కోసం అంతా ఉద్యమించాలని గడీల పాలన, కుటుంబ పాలన సాగిస్తున్న సీఎం కెసిఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆశయాలను అణచివేస్తు మంత్రి వర్గంలో ఒక్క మాల, మాదిగకుగాని, మహిళకుగాని స్థానం కల్పించలేని దుర్మార్గ ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని దుయ్యబట్టారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు అండగా ఉద్యమిస్తామని మెరుగైన పరిహారం చెల్లించేదాకా పోరాడుతామన్నారు.
తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ సమితి ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన తెలంగాణ ఉద్యమకారులను, అమరుల కుటుంబాలను సన్మానిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అమరుల కుటుంబాలను, ఉద్యమకారులను ఒకే వేదికపై పిలిచి సోనియాగాంధీని, మాజీ లోక్‌సభ స్పీకర్ మీరాకుమారితో సన్మానింపచేసి అమరుల త్యాగాల స్ఫూర్తిని చాటుతామన్నారు. డిసిసి అధ్యక్షుడు బూడిద బిక్షమయ్యగౌడ్ మాట్లాడుతు కెసిఆర్ ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిందని, ప్రాజెక్టులు, వాటర్ గ్రిడ్‌ల పేరుతో దోపిడి పాలన సాగిస్తుందన్నారు. ఉద్యమకారులపై నిర్భంధం కొనసాగిస్తు ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు ప్రభుత్వం దిగుతుందన్నారు.
తెలంగాణ కళాకారుడు వేపూరి సోమన్న మాట్లాడుతూ సామాజిక తెలంగాణ, బడుగులకు అధికారం కోసం తన ఆటపాట కొనసాగుతుందని, తనకు ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రజలంతా సామాజిక తెలంగాణ సాధన ఉద్యమానికి తనకు మద్ధతునివ్వాలన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమరుల త్యాగాలను కీర్తిస్తు సాగిన ధూంధాం ఆటపాటలు హోరెత్తించాయి. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా అధ్యక్షుడు బండ్రు శోభారాణి, పలు పార్టీల నాయకులు పొతంశెట్టి వెంకటేశ్వర్లు, సమితి నాయకులు యానాల లింగారెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, సుంకరి సత్యనారాయణ, ప్రదీప్, శ్రీకాంత్‌చారి, మాధవి, పావని, రాజమల్లారెడ్డి పాల్గొన్నారు.