నల్గొండ

అంతర్‌జిల్లా దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 9: నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో గొలుసుల చోరీకి పాల్పడ్డ ముగ్గురు అంతర్‌జిల్లా దొంగలను, చోరీ చేసిన సొత్తును కొనుగోలు చేసిన మరో వ్యక్తిని దేవరకొండ పోలీస్‌లు శనివారం అరెస్ట్‌చేసి వారి నుండి 28 తులాల బంగారం, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నలుగురు నిందితులను శనివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టి డిఎస్పీ చంద్రమోహన్ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి గ్రామానికి చెందిన నున్సావత్ నరేందర్, మహబూబ్‌నగర్ జిల్లా మనె్నవార్‌పల్లి గ్రామానికి చెందిన సపావట్ ముని, సపావట్ మల్లేశ్‌లు ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనంపై వెళ్ళి దేవరకొండ పట్టణంలో కొద్ది రోజుల క్రిందట ఇద్దరు మహిళల మెడలో నుండి 8 తులాల బంగారం గొలుసులను చోరీ చేశారని డిఎస్పీ చెప్పారు. అంతకు ముందు వీరు దేవరకొండలో మహిళ మెడలోనుండి గొలుసును అపహరించారని చెప్పారు. రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నంలలో వారు మహిళల మెడల్లో నుండి బంగారు గొలుసులను చోరీ చేశారని ఆయన చెప్పారు. పట్టుబడ్డ ముగ్గురు దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామానికి చెందిన నేనావత్ శ్రీనివాస్‌కు అమ్మేవారని డిఎస్పీ తెలిపారు. దేవరకొండ పట్టణంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిని విచారణ చేయగా దేవరకొండ, మంచాల, ఇబ్రహిపట్నం లలో మొత్తం 8 దొంగతనాలు చేసినట్లు అంగీకరించారని తెలిపారు. పట్టుబడ్డ దొంగలు ఇచ్చిన సమాచారం మేరకు తుమ్మలూరులో శ్రీనివాస్‌ను అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు. అరెస్ట్ చేసిన దొంగలను కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో దేవరకొండ సి ఐ గట్టుమల్లు, రూరల్ సి ఐ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్ ఐ సర్ధార్, ఐడి పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.