నల్గొండ

‘కాంగ్రెస్‌ను నాశనం చేసింది మీరే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 11: తమ అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిన పిసిసి చీఫ్ ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తనను విమర్శించే నైతికార్హత లేదని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన ఎమ్మెల్యే ఎన్. భాస్కర్‌రావుతో కలిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలకు ముందే నేనంటే నేనే సీఎం నంటూ పోటీలు పడి కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణమైన వారంతా కలిసి ఇప్పుడు తనను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్నటిదాకా ఉత్తమ్‌ను కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేస్ట్‌ఫెలో అని తిట్టగా నేడు బెస్ట్‌ఫెలో ఎప్పుడయ్యాడో ఆయనకే తెలియాలన్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని బయటికి కరచాలనాలు, కౌగిలింతలు చేసుకుంటున్నారంటూ గుత్తా ఎద్ధేవా చేశారు. ఎన్నికల్లో పరస్పరం ఓడించుకునేందుకు ప్రయత్నాలు చేసిన వారు ఇప్పుడు ఏకతారాగం పాడటం ఎవరిని మభ్యపెట్టెందుకంటు నిలదీశారు. కాంట్రాక్టుల కోసమే గుత్తా పార్టీ మారాడంటున్న ఉత్తమ్‌కు అదే వేదికపై ఆయన పక్కనే 1600 కోట్ల కాంట్రాక్టు పొందిన కోమటిరెడ్డి బ్రదర్స్ కాంట్రాక్టుల సంగతి గుర్తుకురాకపోవడం విడ్డూరమన్నారు. కెసిఆర్‌ది కుటుంబ పాలనంటూ తిట్టిన పిసిసి చీఫ్ ఉత్తమ్, ఆయన భార్య పద్మావతిలు, కోమటిరెడ్డి సోదరులు ఒకే కుటుంబం వారే కదా అంటు నిలదీశారు. కెసిఆర్ ఎన్నికల హామీలన్ని అమలు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న జానారెడ్డి మాటల వెనుక అసలు నిజం అదికాదని కాంగ్రెస్‌లో ఉత్తమ్, కోమటిరెడ్డిల కుమ్ములాటలతో విసుగెత్తే ఆయన సన్యాసం మాటలు మాట్లాడుతున్నాడంటు గుత్తా విశే్లషించారు. తాను లేకపోతే ఎంపి గుత్తా గెలిచేవాడు కాదంటున్న కోమటిరెడ్డి ముందుగా 2009, 2014ఎన్నికల్లో ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయనకు, నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుంటే ఎవరి గెలుపుకు ఎవరు ఉపయోగపడ్డారో తెలుస్తుందంటు చురకలేశారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో కోమటిరెడ్డి కంటే తనకే ఎక్కువ ఓట్లు వచ్చిన సంగతి ఎన్నికల ఫలితాల చరిత్ర చాటుతుందన్నారు. ఎంపిగా నేను రాజీనామా చేస్తే నాపై సాధారణ అభ్యర్ధిని పెట్టి గెలిపిస్తానంటున్న కోమటిరెడ్డి తాను పోటీ నుండి విరమించుకున్నట్లేనా అంటు గుత్తా ప్రశ్నించారు. ఇతరులపై అనవసరమైన పసలేని విమర్శలు చేయడం మానుకుని ఉత్తమ్, కోమటిరెడ్డిలు వారి పనేదో వారు చూసుకుంటే మంచిదని లేనట్లయితే వచ్చే ఎన్నికల్లో వారు ఓడిపోవడం ఖాయమని గుత్తా అన్నారు. మిర్యాలగూడలో కేవలం తనను తిట్టేందుకే 20లక్షలు ఖర్చు చేసి కాంగ్రెస్ సమావేశం పెట్టిన తీరు చూస్తే నా పార్టీ మార్పుతో కాంగ్రెస్ బలహీనపడిందని ఆ పార్టీ నేతలు భయపడుతున్నట్లుగా తేలుతుందన్నారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.