నల్గొండ

నియంతలా వ్యవహరిస్తున్న సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేటటౌన్, జూలై 11: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసి ఆర్ నియంతలా వ్యవహరిస్తూ ప్రశ్నించిన వారిని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటిసభ్యుడు ధన్యాకు శ్రీకాంత్‌వర్మ, పిడి ఎస్‌యు జిల్లా అధ్యక్షుడు ఎర్ర అఖిల్ అన్నారు. సోమవారం వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చౌటుప్పల్‌లో ముఖ్యమంత్రికి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందించేందుకు వెళ్లిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్ట్ చేసి కేసునమోదు చేయడం సిగ్గుచెట్టాన్నారు. వెంటనే వారిపై పెట్టిన కేసులను ఉపసంహరించి విడుదల చేయాలని వారు డిమాండ్‌చేశారు. ఎన్ని నిర్భందాలు ఎదురైన విద్యారంగ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. బంద్ నిర్వహిస్తున్న వామపక్ష సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్ధి సంఘాల నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు వారి అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ బంద్‌లో విద్యార్థి సంఘాల నాయకులు దేవేందర్, పరశరాములు, గణేష్, సానబోయిన ఉపేందర్, ఎరుకుల సైదులు, అవిరె వేణు, గోపి, లింగయ్య పాల్గొన్నారు.