నల్గొండ

కట్టుదిట్టంగా ఎమ్మెల్సీ ఎన్నికలు:కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలెక్టరేట్ ( నల్లగొండ ), నవంబర్ 28 : జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరించి ప్రశాతం వాతావరణంలో జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి కోరారు. శనివారం టిటిడిసి సమావేశ మందిరంలో జిల్లా అధికారులు, పోలీసు అధికారులు మున్సిపల్ కమీషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు డిసెంబర్ 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని, రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు కరపత్రాలు, పోష్టర్లు ముద్రించరాదని, ఓటర్లను ప్రలోభపెట్టరాదన్నారు. ఓటర్ ఐడి కార్డులు తప్పులు లేకుండా అదించాలని అధికారులకు సూచించారు. డిఎస్పీ గంగారం మాట్లాడుతూ ఎన్నికలకు తమశాఖకు పూర్తి సహాయ సహాకారాలందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జెసి వెంకట్రావు, డిఆర్‌వో రవి, జడ్పీ సిఈవో మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ టౌన్, నవంబర్ 28 : జిల్లాలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో 59 మండలాలకు గాను 22 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని, మిగిలిన మండలాలలో అధికారులు క్షేత్రస్ధాయిలో పర్యటించి నివేదికను మరోమారు ప్రభుత్వానికి అందజేయాలని సూచించారు. రైతాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులో అప్పుల ఊభిలో కూరుకపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కరువు మండలాలుగా ప్రకటించని 37 మండల కేంద్రాలలో డిసెంబర్ 1,2,3లలో రీలే నిరాహర దీక్షలు చేపడతామని రైతులు, ప్రజలు సహకరించాలని కోరారు. కరువు పరిస్ధితుల వల్ల ప్రజలు వలసలు వెళ్తున్నారని, వలసల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండా శ్రీశైలం, తిరందాసు గోపి, తుమ్మల వీరారెడ్డి, నారీ ఐలయ్య, మల్లు లక్ష్మి, కొండమడుగు నర్సింహ్మ తదితరులు పాల్గొన్నారు.

సకాలంలో పనులు పూర్తి చేయాలి
రామగిరి, నవంబర్ 28 : వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సిటిజన్ చార్టర్ ప్రకారం పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. జిల్లా, డివిజన్, మండల క్షేత్రస్ధాయి అధికారులు వివిధ సమస్యలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.