నల్గొండ

ఎల్-27 ఎత్తిపోతల పథకం ఆదర్శనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, జూలై 22 : మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం (ఎల్-27) తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శనీయంగా ఉందని గోదావరి జలాల వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి అన్నారు. గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులోని సాగర్ ఎడమ ప్రధాన కాల్వపై ఉన్న ఎల్-27 ఎత్తిపోతల పథకాన్ని శుక్రవారం నిపుణలతో కలిసి సందర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 1969లో రైతుల సహకారంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించుకోవడం హర్షణీయమన్నారు. తక్కువ ఖర్చుతో నూతన టెక్నాలజీ ద్వారా ఎత్తిపోతల పథకాన్ని నిర్వహించడాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో గరిడేపల్లి, నేరేడుచర్ల, పెన్‌పహాడ్ మండలాలకు చెందిన 6,600 ఎకరాలు సేద్యం కావటం ఈప్రాంత రైతుల అదృష్టమన్నారు. పథకం నిర్వహణ, కాల్వల నిర్మాణం, యంత్రపరికరాలు తదితర విషయాలను పథకం ఛైర్మన్ డాక్టర్ ఘంటా గోపాలరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ వచ్చి ఈపథకాన్ని చూడాలని, అమలు అవుతున్న తీరును తెలుసుకోవాలని కోరారు. దీనిని నమూనాగా తీసుకుని అతి తక్కువ ఖర్చుతో కొత్త ఎత్తిపోతల పథకాలను నిర్మించవచ్చన్నారు. రిజర్వాయర్ల నిర్మాణానికి, భూసేకరణకు తాము వ్యతిరేకమని తెలిపారు. తక్కువ ఖర్చుతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు లాభం జరిగేవిధంగా రాష్ట్రంలో పథకాలు చేపట్టాలన్నారు. రిజర్వాయర్ల నిర్మాణం పేరుతో రైతులకు చెందిన భూములను తీసుకుంటే తాము సహించేదిలేదన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకిస్తున్నప్పటికి కెసి ఆర్ పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. 14 గ్రామాలకు చెందిన 20 వేల ఎకరాలను తీసుకుని 50 టి ఎంసిల రిజర్వాయర్‌ను నిర్మిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. ముఖ్యమంత్రి కెసి ఆర్ ఇకనైనా కళ్లు తెరిచి కేత్రస్థాయిలోపథకాలను సందర్శించి వాస్తవాలను తెలుసుకోవాలన్నారు. పథకాల నిర్మాణంలో మేధావులు, నిపుణలు, ప్రజాప్రతినిధుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. మల్లన్న సాగర్ నిర్మాణంపై పోరాటానికి సిద్దమన్నారు. రిజర్వాయర్‌ల నిర్మాణాలను నిలిపివేసి డైరక్ట్ పంపింగ్ చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. కెసిఆర్ మాటలతో కాకుండ చేతలతో రైతులకు మేలు చేయాలని కోరారు. అనంతరం గడ్డిపల్లిలోని కెవికెలోని వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలను ఆయన పరిశీలించారు. వర్మికంపోస్టు తయారీ, జీవన ఎరువుల తయారీలాంటి వివిధ క్షేత్రాలను ఆయన పరిశీలించి శాస్తవ్రేత్తలు రూపొందించే విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం రైతులకు చేరినప్పుడే వ్యవసాయం అభివృద్ధిలోకి వస్తుందన్నారు. విజ్ఞాన యాత్రలో భాగంగా కెవికె వచ్చిన చిలుకూరు డిఇడి కళాశాల విద్యార్ధులతో కొద్దిసేపు ముచ్చటించారు. వారికి హరితహారంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, దానిని పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, నిరంజన్, రవి, కెవికె కార్యదర్శి డాక్టర్ ఘంటా గోపాలరెడ్డి, శాస్తవ్రేత్తలు తదితరులు పాల్గొన్నారు.